"సీఎం మాట్లాడేదాకా కూర్చోమ్మా"... బూట్లేసి బాబు బురదవాక...

టీడీపీ ప్రభుత్వం హంగామా చేసిన ఏరువాక కార్యక్రమం టీడీపీ కార్యక్రమంలాగే సాగింది. సోకులెక్కువ, సరుకు తక్కువ అన్నట్టుగా జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న ఏరువాకకే జనం నుంచి స్పందన కరువైంది. ఏరువాక సందర్భంగా నిర్వహించిన చంద్రబాబు సభలో సగం ఖాళీ కూర్చేలే కనిపించాయి. చంద్రబాబు ఎప్పటి లాగే తన 30 ఏళ్ల కేరీర్‌లోని అనుభవాలతో మొదలుపెట్టి విజన్ 2050వరకు సుధీర్ఘంగా మాట్లాడుతూ ఉండే సరికి జనానికి విసుగొచ్చేసింది. అధికారులు కష్టపడి తరలించిన మహిళలు సైతం బాబు […]

Advertisement
Update: 2016-06-20 11:12 GMT

టీడీపీ ప్రభుత్వం హంగామా చేసిన ఏరువాక కార్యక్రమం టీడీపీ కార్యక్రమంలాగే సాగింది. సోకులెక్కువ, సరుకు తక్కువ అన్నట్టుగా జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న ఏరువాకకే జనం నుంచి స్పందన కరువైంది. ఏరువాక సందర్భంగా నిర్వహించిన చంద్రబాబు సభలో సగం ఖాళీ కూర్చేలే కనిపించాయి. చంద్రబాబు ఎప్పటి లాగే తన 30 ఏళ్ల కేరీర్‌లోని అనుభవాలతో మొదలుపెట్టి విజన్ 2050వరకు సుధీర్ఘంగా మాట్లాడుతూ ఉండే సరికి జనానికి విసుగొచ్చేసింది. అధికారులు కష్టపడి తరలించిన మహిళలు సైతం బాబు మాట్లాడుతుండగానే కూర్చీలు ఖాళీ చేసేశారు. దీంతో పోలీసులు వారిని బతిమలాడడం కనిపించింది. కాసేపు ఉండడమ్మ సీఎం ప్రసంగం అయిపోగానే వెళ్లిపోదురూ అంటూ బలవంతంగా కూర్చోబెట్టారు. కానీ అప్పటికే సగం కూర్చీలు ఖాళీ అయిపోయాయి.

మరోవైపు…. ఏరువాక దున్నేస్తా అంటూచంద్రబాబు బూట్లు వేసుకుని పొలంలోకి దిగేశారు. బురదలో బూట్లేసుకునే దున్నేశారు. పూజ సమయంలోనూ ఆయన పాదరక్షలు తీయలేదు. ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన వారు ఆసక్తిగా గమనించారు. తలపాగా కూడా అక్కడున్న కొందరు రెండుమూడు సార్లు కష్టపడి చంద్రబాబుకు చుట్టారు. ఇక జిల్లాల్లోనూ ఏరువాక ఇదే తరహాలో సాగిపోయింది. రైతులతో సంబంధం లేకుండా మంత్రులు, అధికార పార్టీల ఫొటో షూట్‌లాగా తంతు సాగింది. చివరకు నాగళ్లకు కూడా పచ్చరంగేశారు తమ్ముళ్లు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News