కళలతో కలిసిపోతే...కలతమాయం!

మనకు నచ్చిన పనిలో లేదా ఏదైనా ఒక కళాభిరుచిలో నిమగ్నమైపోయినపుడు ప్రపంచాన్నే మర్చిపోయాం… అని చెబుతుంటాం. అంటే ఆ సమయంలో మనం ఈ ప్రపంచం నుండి, దానికి సంబంధించిన విషయాల నుండి మాయమైపోయినట్టుగానే భావించాలి. యుకెలోని డ్రెక్సెల్ వర్శిటీ శాస్త్రవేత్తలు సైతం ఇదే చెబుతున్నారు. మీకు నచ్చిన కళతో మీకున్న అనుబంధం ఒత్తిడిని తగ్గిస్తుంది అంటున్నారువారు. 18నుండి 59ఏళ్ల మధ్య వయసున్న 39మంది మీద అధ్యయనం చేసి ఈ ఫలితాలను వెల్లడించారు. కాగితాలు, మట్టి…ఇలాంటి భిన్న కళారూపాల […]

Advertisement
Update: 2016-06-18 23:52 GMT

మనకు నచ్చిన పనిలో లేదా ఏదైనా ఒక కళాభిరుచిలో నిమగ్నమైపోయినపుడు ప్రపంచాన్నే మర్చిపోయాం… అని చెబుతుంటాం. అంటే సమయంలో మనం ప్రపంచం నుండి, దానికి సంబంధించిన విషయాల నుండి మాయమైపోయినట్టుగానే భావించాలి. యుకెలోని డ్రెక్సెల్ వర్శిటీ శాస్త్రవేత్తలు సైతం ఇదే చెబుతున్నారు. మీకు నచ్చిన కళతో మీకున్న అనుబంధం ఒత్తిడిని తగ్గిస్తుంది అంటున్నారువారు. 18నుండి 59ఏళ్ల మధ్య వయసున్న 39మంది మీద అధ్యయనం చేసి ఫలితాలను వెల్లడించారు. కాగితాలు, మట్టిఇలాంటి భిన్న కళారూపాల తయారీకి అవసరమైన వస్తువులను వారికి అందుబాటులో ఉంచి, వారికిష్టమైన కళాకృతులను సృష్టించమన్నారు. ముప్పావు గంట తరువాత పరిశీలించినపుడు వారిలో 75 శాతం మందిలో లాలాజలంలో ఉండే ఒత్తిడి హార్మోను కార్టిసాల్ స్థాయి గణనీయంగా తగ్గటం గమనించారు. ఈ కార‌ణంగానే ఇప్పుడు కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేయటం అనే కాన్సెప్టుకి విస్తృత ప్రచారం లభిస్తోంది. ఇష్టంగా పనిచేస్తున్నపుడు మాత్రమే మనం నూరుశాతం నిమగ్నం కాగలుతాం. అదే ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే పిల్లలకు కూడా చిన్నతనం నుండి వారికి నచ్చిన ఏదో ఒక కళలో అభిరుచిలో ప్రోత్సాహం ఇస్తూ ఉండాలి అంటారు.

Advertisement

Similar News