సినీ పరిశ్రమ తీరుపై దాసరి, కైకాల తీవ్ర అసంతృప్తి

తెలుగు సినీపరిశ్రమ పోకడలపై దర్శకుడు దాసరి నారాయణ, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ”మా” ఆధ్వర్యంలో కైకాల సత్యనారాయణ, జమునను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన దాసరి… సీనియర్ నటుల సంక్షేమం గురించి పరిశ్రమ పెద్దలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీనియర్లు, పేద నటుల సంక్షేమం గురించి గతంలోనే మురళీమోహన్‌కు వివరించానని చెప్పారు. అయినా వారి సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలలో టాలెంట్‌కు చోటు […]

Advertisement
Update: 2016-06-12 02:27 GMT

తెలుగు సినీపరిశ్రమ పోకడలపై దర్శకుడు దాసరి నారాయణ, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ”మా” ఆధ్వర్యంలో కైకాల సత్యనారాయణ, జమునను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన దాసరి… సీనియర్ నటుల సంక్షేమం గురించి పరిశ్రమ పెద్దలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీనియర్లు, పేద నటుల సంక్షేమం గురించి గతంలోనే మురళీమోహన్‌కు వివరించానని చెప్పారు. అయినా వారి సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమలలో టాలెంట్‌కు చోటు లేకుండా పోయిందని ఆవేదన చెందారు. సిఫార్సులను పట్టించుకుంటున్నారని దాసరి మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన కైకాల సత్యనారాయణ… సీనియర్ నటులకు పరిశ్రమలలో గౌరవం లేకుండా పోయిందన్నారు. ఎప్పుడు ఏ సినిమా వేడుక జరుగుతుందో కూడా తెలియడం లేదని వాపోయారు. ”మా” కొన్ని మంచి పనులుచేస్తోందని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News