వైసీపీ ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డికి పోటు మొదలైంది

ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీలోనూ విబేధాలు బయలుదేరాయి. ఇటీవల వైసీపీనుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు జట్టుకట్టాయి. నిన్నకాకమొన్న పార్టీలోకి వచ్చిన అశోక్ రెడ్డి అప్పుడే తమను వేధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ గిద్దలూరు ఇన్‌చార్జ్ అన్నె రాంబాబు అనుచరులు ఆందోళనకు సిద్దమయ్యారు. 600 మంది కార్యకర్తలు, స్థానిక టీడీపీ నాయకులు మంత్రి శిద్ధారాఘవరావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అశోక్‌రెడ్డిని అదుపు చేయాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. […]

Advertisement
Update: 2016-06-08 04:58 GMT

ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీలోనూ విబేధాలు బయలుదేరాయి. ఇటీవల వైసీపీనుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు జట్టుకట్టాయి. నిన్నకాకమొన్న పార్టీలోకి వచ్చిన అశోక్ రెడ్డి అప్పుడే తమను వేధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ గిద్దలూరు ఇన్‌చార్జ్ అన్నె రాంబాబు అనుచరులు ఆందోళనకు సిద్దమయ్యారు. 600 మంది కార్యకర్తలు, స్థానిక టీడీపీ నాయకులు మంత్రి శిద్ధారాఘవరావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.

అశోక్‌రెడ్డిని అదుపు చేయాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అకోశ్‌ను కట్టడి చేయని పక్షంలో ఏం చేయాలో తమకు తెలుసంటున్నారు. అశోక్‌ రెడ్డి రాకను తొలినుంచి కూడా అన్నా రాంబాబు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. టీడీపీ నాయకత్వ తీరుకు నిరసనగా ఒంగోలులో జరిగిన మినీమహానాడుకు కూడా ఆయన హాజరుకాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు న్యాయం జరక్కపోతే తన దారి తాను చూసుకోవాల్సివస్తుందని కూడా అన్నా రాంబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News