బాబు రెండేళ్ల పాలనపై టీవీ5 సర్వే

చంద్రబాబు రెండేళ్ల పాలనపై తెలుగు టీవీఛానల్‌ టీవీ5 సర్వే నిర్వహించినట్టు తెలిపింది. సర్వే ఫలితాలను వెల్లడించింది. రెండేళ్ల పాలనపై ప్రజలు గందరగోళంలో ఉన్నట్టుగా సర్వే ఫలితాలను బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు రెండేళ్ల పాలన బాగుందా అన్న ప్రశ్నకు.. 43 శాతం మంది బాగుందని అభిప్రాయపడ్డారట. పర్వాలేదు అని 33 శాతం మంది, బాగాలేదు అని 24 శాతం చెప్పినట్టు టీవీ5 వెల్లడించింది. చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తారని నమ్ముతున్నారా అన్న ప్రశ్నకు 42శాతం మంది చంద్రబాబుపై నమ్మకం వ్యక్తంచేశారు. […]

Advertisement
Update: 2016-06-07 09:28 GMT

చంద్రబాబు రెండేళ్ల పాలనపై తెలుగు టీవీఛానల్‌ టీవీ5 సర్వే నిర్వహించినట్టు తెలిపింది. సర్వే ఫలితాలను వెల్లడించింది. రెండేళ్ల పాలనపై ప్రజలు గందరగోళంలో ఉన్నట్టుగా సర్వే ఫలితాలను బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు రెండేళ్ల పాలన బాగుందా అన్న ప్రశ్నకు.. 43 శాతం మంది బాగుందని అభిప్రాయపడ్డారట. పర్వాలేదు అని 33 శాతం మంది, బాగాలేదు అని 24 శాతం చెప్పినట్టు టీవీ5 వెల్లడించింది. చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తారని నమ్ముతున్నారా అన్న ప్రశ్నకు 42శాతం మంది చంద్రబాబుపై నమ్మకం వ్యక్తంచేశారు. 26 మంది నవ్యాంధ్రనిర్మించలేరని చెప్పినట్టు టీవీ5చెబుతోంది. మరో 32 శాతం మంది చెప్పలేమన్నారట. చంద్రబాబు నవ్యాంధ్రను నిర్మిస్తారా అన్న ప్రశ్నకు ప.గో జిల్లా, కడపజిల్లా, అనంతపురం జిల్లావారి నుంచి నెగిటివ్ స్పందన వచ్చిందని సర్వే చెబుతోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో కేవలం 39 శాతం మంది మాత్రమే నవ్యాంధ్రనిర్మాణం విషయంలో చంద్రబాబుపై నమ్మకాన్ని వ్యక్తపరిచారు. అనంతపురం జిల్లాలో 36 శాతం మంది, కడప జిల్లాలో 29 శాతం మంది మాత్రమే చంద్రబాబు నవ్యాంధ్ర నిర్మిస్తారని చెప్పారు. చంద్రబాబు పాలనలో అవినీతి తగ్గిందని చాలా చెప్పారట. మొత్తం మీద సర్వే చూస్తుంటే చంద్రబాబు పాలనకు అయింట్‌మెంట్ రాసినట్టుగానే ఉంది. ఈ సర్వే నిజాయితీపైనా చర్చలో పాల్గొన్న వారు అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News