ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో... మహిళకు వెలకట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు

ఆయనొస్తేనే బాగుంటుందని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ఆయన రాకముందు మహిళలకు భద్రతే లేదని ప్రచారం చేశారు. బాబు వస్తే గాంధీ చెప్పినట్టు అర్థరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డుపై తిరిగే పరిస్థితి ఉంటుందని నమ్మించారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే… పక్కనే భర్త ఉన్నా సరే మహిళలు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి. తహసీల్దార్‌ వనజాక్షిని ఇసుకలో పడేసి ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈడ్చి కొడితే లోకమంతా  చూసినా నిందితులపై […]

Advertisement
Update: 2016-05-26 22:48 GMT

ఆయనొస్తేనే బాగుంటుందని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ఆయన రాకముందు మహిళలకు భద్రతే లేదని ప్రచారం చేశారు. బాబు వస్తే గాంధీ చెప్పినట్టు అర్థరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డుపై తిరిగే పరిస్థితి ఉంటుందని నమ్మించారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే… పక్కనే భర్త ఉన్నా సరే మహిళలు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి. తహసీల్దార్‌ వనజాక్షిని ఇసుకలో పడేసి ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈడ్చి కొడితే లోకమంతా చూసినా నిందితులపై చర్యలు లేవు.

తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో 29 ఏళ్ల వివాహిత మాటూరి లావణ్యను వెంటాడి కారుతో తొక్కించి చంపిన కేసును నీరుగార్చేందుకు కొందరు అధికార పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ప్రధాన నిందితుడు దాడి హేమకుమార్‌ను కాపాడేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ హేమకుమార్ ఒక మాజీ మంత్రికి ప్రధాన అనుచరుడని చెబుతున్నారు. అందుకే ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి లావణ్య కుటుంబాన్ని బెదిరించి సెటిల్‌మెంట్ చేసినట్టు తెలుస్తోంది. లావణ్య ప్రాణానికి పది లక్షల 25వేలు వెలకట్టారని చెబుతున్నారు.

విశాఖపట్నానికి చెందిన స్థానిక పత్రిక ఒకటి సెటిల్ మెంట్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే పేరుకూడా ప్రచురించింది. కేసు పెట్టడం వల్ల సాధించేదేమీ ఉండదని తాము చెప్పినట్టు డబ్బు తీసుకుని సైలెంట్‌గా ఉంటే లావణ్య పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఒత్తిడి తెచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే నేరుగా రంగంలోకి దిగడంతో లావణ్య కుటుంబం కూడా ఏమీ చేయలేకపోయింది. లావణ్య ఇద్దరు పిల్లల పేరున చొరో ఐదులక్షలు హేమకుమార్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేలా టీడీపీ పెద్దలు డీల్ కుదిర్చారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పెద్దల సమక్షంలోనే 5 లక్షలు చెల్లించినట్టు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. మిగిలిన మొత్తం త్వరలోనే చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారట.

ఆ రోజు ఏం జరిగిందంటే…

వడ్లపూడి ప్రాంతానికి చెందిన మోహన్ కుమార్, లావణ్య దంపతులు ఆదివారం అనకాపల్లిలోని నూకాలయ్య ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం బైక్ పై తిరిగివస్తుండగా… దాడి హేమకుమార్ అతడి స్నేహితులు మద్యం సేవించి కారులో వెంబడించారు. లావణ్యను చిల్లరమాటతో వేకిలి చేష్టలతో వేధించారు. ఆమె అసహనం వ్యక్తం చేయడంతో ఆగ్రహించిన హేమకుమార్ తనకారుతో లావణ్యను ఢీకొట్టాడు. కిందపడిన లావణ్యపై కారుతో తొక్కించి చంపేశారు. తొలుత అంతా దీన్ని రోడ్డుప్రమాదమే అనుకున్నారు. అయితే ఇది హత్య అని టీడీపీ నేతకోటేశ్వరరావు తొలుత ఆరోపించారు. లోతుగా ఆరా తీయగా కారుతో తొక్కించి చంపినట్టు తెలిసింది. దీంతో హత్య కేసు నమోదు కాకుండా టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి సెటిల్‌మెంట్లు చేశారు. ప్రధాన నిందితుడు ప్రస్తుతం ఒక టీడీపీ ఎమ్మెల్యే సంరక్షణలో ఉన్నట్లు సమాచారం.

పోలీసుల పనితీరు..

పోలీసులు మాత్రం ఎప్పటిలాగే గోళ్లు గిల్లుకుంటూ కూర్చుకున్నారు. హత్య చేసినట్టు బాధితుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు వస్తేనే తాము దర్యాప్తు చేసే వీలుంటుందని ట్రాఫిక్ సీఐ కృష్ణ చెప్పగా.. ట్రాఫిక్ పోలీసుల నుంచి తమకు కేసు బదిలీ అయితే తప్ప ప్రమాదంపై తాము దర్యాప్తు చేపట్టలేమని పరవాడ శాంతిభద్రతల విభాగం పోలీసులు చెబుతున్నారు. ఫైనాన్షియరైన ప్రధాన నిందితుడు హేమకుమార్ ప్రవర్తనపై అనకాపల్లిలో ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని కఠినంగా శిక్షించాలని, ఈ కేసును తీవ్రంగా పరిగణించాలంటూ అనకాపల్లి ప్రాంతానికి చెందిన పలు ప్రజా సంఘాలు, మహిళలు డిమాండ్ చేస్తున్నాయి. హేమకుమార్ వాడిన కారుకు బీమా లేదని, అతడికి లైసెన్స్ కూడా లేదని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News