టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్‌

తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. రెండురోజుల పాటు ఫాంహౌజ్ లో కసరత్తు చేసిన కేసీఆర్‌ ఇద్దరి పేర్లను ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న డీఎస్‌తో పాటు తనకు అత్యంత సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీకాంతరావును కేసీఆర్‌ ఎంపిక చేశారు. వీరితో పాటు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ పేరును ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల పార్టీ పర్యవేక్షకులుగా నాయిని నర్సింహారెడ్డి, […]

Advertisement
Update: 2016-05-26 05:21 GMT

తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. రెండురోజుల పాటు ఫాంహౌజ్ లో కసరత్తు చేసిన కేసీఆర్‌ ఇద్దరి పేర్లను ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న డీఎస్‌తో పాటు తనకు అత్యంత సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీకాంతరావును కేసీఆర్‌ ఎంపిక చేశారు. వీరితో పాటు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ పేరును ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల పార్టీ పర్యవేక్షకులుగా నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్ ఉంటారు. డీఎస్ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా చేశారు. అయితే 2014 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ లో చేరారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News