కొత్త పార్టీ ప్రతిపాదన

మాజీ ఎంపీ హర్షకుమార్‌ను కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు. రాజమండ్రిలోని హర్షకుమార్ ఇంటిలో ఈ భేటీ జరిగింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. కొత్త పార్టీ ప్రతిపాదనను హర్ష్‌కుమార్ తీసుకొచ్చారు. రాష్ట్రంలో కాపులు, దళితులు కలిసి కొత్తపార్టీ పెడితే బాగుంటుందని సూచించారు. రెండు బలమైన వర్గాలు కలిస్తే రాజకీయాలను శాసించవచ్చన్నారు. అయితే హర్షకుమార్ ప్రతిపాదనపై ముద్రగడ మౌనంగా ఉన్నారని చెబుతున్నారు. కొత్త పార్టీ ప్రతిపాదన హర్షకుమార్ వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలని ముద్రగడ చెప్పారు. […]

Advertisement
Update: 2016-05-22 00:28 GMT

మాజీ ఎంపీ హర్షకుమార్‌ను కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు. రాజమండ్రిలోని హర్షకుమార్ ఇంటిలో ఈ భేటీ జరిగింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. కొత్త పార్టీ ప్రతిపాదనను హర్ష్‌కుమార్ తీసుకొచ్చారు. రాష్ట్రంలో కాపులు, దళితులు కలిసి కొత్తపార్టీ పెడితే బాగుంటుందని సూచించారు. రెండు బలమైన వర్గాలు కలిస్తే రాజకీయాలను శాసించవచ్చన్నారు. అయితే హర్షకుమార్ ప్రతిపాదనపై ముద్రగడ మౌనంగా ఉన్నారని చెబుతున్నారు.

కొత్త పార్టీ ప్రతిపాదన హర్షకుమార్ వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలని ముద్రగడ చెప్పారు. కాపు ఉద్యమ సమయంలో హర్షకుమార్ మద్దతు ప్రకటించారని అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానన్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి తాము ఇచ్చిన గడువు ఆగస్టు వరకు ఉందని.. ఆ లోపు నిర్ణయం రాకుంటే మరో ఉద్యమం తప్పదని అన్నారు. ముద్రగడ అన్ని ఆలోచించే అడుగువేసే వ్యక్తి అని హర్షకుమార్ అన్నారు. 1989 నుంచే ముద్రగడతో తనకు పరిచయం ఉందన్నారు. రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప రిమోట్ కంట్రోల్‌ ద్వారా పనిచేస్తున్నారని విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News