పుష్కర విషాదం- ఆత్మలే అవాక్కయ్యేలా కలెక్టర్ నివేదిక

ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు బయటకు రావడం ఏమాత్రంసాధ్యం కాదని మరోసారి రుజువైంది. గతేడాది గోదావరి పుష్కరాల సమయంలో 27 మంది చనిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ నివేదిక సిద్ధం చేశారు. ఏకసభ్య కమిషన్‌కు ఇచ్చేందుకు సిద్ధం చేసిన ఈ నివేదికలో తప్పును చనిపోయిన వారి మీదే తోసేశారు. భక్తుల తొందరపాటు వల్లే ప్రమాదం జరిగిందని కలెక్టర్ అరుణ్ కుమార్ తేల్చేశారు. జనం భారీగా వచ్చారని ఆక్సిజన్ అందకపోవడం, డీహైడ్రేషన్‌ కూడా ప్రమాదానికి కారణం అంటూ విచిత్రంగా […]

Advertisement
Update: 2016-05-15 00:14 GMT

ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు బయటకు రావడం ఏమాత్రంసాధ్యం కాదని మరోసారి రుజువైంది. గతేడాది గోదావరి పుష్కరాల సమయంలో 27 మంది చనిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ నివేదిక సిద్ధం చేశారు. ఏకసభ్య కమిషన్‌కు ఇచ్చేందుకు సిద్ధం చేసిన ఈ నివేదికలో తప్పును చనిపోయిన వారి మీదే తోసేశారు. భక్తుల తొందరపాటు వల్లే ప్రమాదం జరిగిందని కలెక్టర్ అరుణ్ కుమార్ తేల్చేశారు. జనం భారీగా వచ్చారని ఆక్సిజన్ అందకపోవడం, డీహైడ్రేషన్‌ కూడా ప్రమాదానికి కారణం అంటూ విచిత్రంగా నివేదిక సిద్ధం చేశారు.

జనసమూహాన్ని పోలీసులు సమర్థవంతంగా నియంత్రించినా అనుకోనిప్రమాదం జరిగిపోయిందని తేల్చేశారు. దారులు చాలా వెడల్పుగానే ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తన నివేదికలో పొందుపరిచారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదని చెప్పారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన కొత్త సీసీ కెమెరాల్లో విజువల్స్ ఎందుకు రికార్డు కాలేదో మాత్రం చెప్పలేదు. ఈ సీసీ పుటేజ్‌ను కావాలని మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ప్రమాదంపై అప్పట్లోనే కలెక్టర్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అందులో మాత్రం సీఎం, వీఐపీలు ఎక్కువసేపు ఘాట్‌లో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. జనాన్ని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని అప్పట్లో కలెక్టరే నివేదిక ఇచ్చారు. ఇప్పుడు మాత్రం సీఎం, పోలీసులది ఎలాంటి తప్పులేదని కలెక్టర్ సర్టిఫై చేసేశారు. తప్పంతా భక్తులదేనంటూ చనిపోయిన వారి ఆత్మలు కూడా అవాక్కయ్యేలా రిపోర్టు ఇచ్చారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News