మా సార్‌ మరీ ఇంత చిల్లరా?

లీడర్ల అవినీతి రెండు రకాలు. ఒకటి- ముసుగేసుకుని దోచేయడం. రెండు- ముసుగుతీసి బరి తెగించి కుమ్మేయడం. ఏపీలో మాత్రం రెండో తరహా వ్యవహారమే నడుస్తోందన్నది జగమెరిగిన సత్యమే. అయితే వడదెబ్బ నివారణకు హేరిటేజ్ మజ్జిగ పథకం చూసి టీడీపీ సీనియర్ నేత ఒకరు అవేదన చెందారట. అయితే అవినీతి జరుగుతోందని కాదు… మరీ చీప్‌గా ప్లాన్‌ చేశారని సదరు సీనియర్ నేత ఆవేదన. మజ్జిగ పథకం ప్రకటించగానే ఇది హెరిటేజ్ కోసమేనని విపక్షాలన్నీ ఆరోపించాయి. తెలివైన వారయితే […]

Advertisement
Update: 2016-05-14 00:01 GMT

లీడర్ల అవినీతి రెండు రకాలు. ఒకటి- ముసుగేసుకుని దోచేయడం. రెండు- ముసుగుతీసి బరి తెగించి కుమ్మేయడం. ఏపీలో మాత్రం రెండో తరహా వ్యవహారమే నడుస్తోందన్నది జగమెరిగిన సత్యమే. అయితే వడదెబ్బ నివారణకు హేరిటేజ్ మజ్జిగ పథకం చూసి టీడీపీ సీనియర్ నేత ఒకరు అవేదన చెందారట. అయితే అవినీతి జరుగుతోందని కాదు… మరీ చీప్‌గా ప్లాన్‌ చేశారని సదరు సీనియర్ నేత ఆవేదన. మజ్జిగ పథకం ప్రకటించగానే ఇది హెరిటేజ్ కోసమేనని విపక్షాలన్నీ ఆరోపించాయి. తెలివైన వారయితే ఎట్టి పరిస్థితుల్లోనూ హెరిటేజ్‌కు ఆ పథకం అప్పగించరు. కానీ చంద్రబాబు మాత్రం ఏకంగా కలెక్టర్లతోనే అధికారికంగా హెరిటేజ్ మజ్జిగ కొనాలని ఆదేశాలిప్పించారు. ఇక్కడే సదరుసీనియర్ టీడీపీ నేత చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు.

డబ్బులు కావాలనుకుంటే మజ్జిగ సరఫరా కాంట్రాక్టు ఇతర కంపెనీలకు అప్పగించి ఉంటే హెరిటేజ్‌కు వచ్చే లాభం ఏదో సరదు సంస్థే కమిషన్ రూపంలో ఇచ్చేది కదా అని ప్రశ్నిస్తున్నారు. సొంత సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి పార్టీ పరువు తీశారని సీమ సీనియర్ నేత సన్నిహితుల దగ్గర ఆవేదన చెందారట. వేల కోట్ల సంపాదన ఉన్నా కూడా ఇలా చిల్లర డబ్బులకు పాకులాడటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారట. విపక్షాల ఆరోపణలు చేసిన తర్వాత హెరిటేజ్‌కే మజ్జిగ కాంట్రాక్టు అప్పగించాల్సినంత దౌర్భాగ్యం ఎందుకొచ్చిందో అని నిట్టూర్పు విడిచారట. ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల సంస్థ బ్రాండ్ నేమ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని సదరు నేత అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. అయినా ఎన్ని వేల కోట్లు సంపాదించినా హెరిటేజ్‌లో వచ్చే ఇలాంటి ఆదాయం రుచే వేరులేండి!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News