అమావాస్య‌కీ పున్న‌మికీ...మ‌న‌లో మార్పు వ‌స్తుందా?!

చాలామంది న‌మ్ముతుంటారు ఈ విష‌యం. చంద్రుడిలో వ‌చ్చే హెచ్చుత‌గ్గులు మ‌న‌లో మార్పుల‌ను తీసుకువ‌స్తాయ‌ని, ముఖ్యంగా అమావాస్య‌, పౌర్ణ‌మి రోజుల్లో మాన‌సికంగా బ‌ల‌హీనంగా ఉన్న‌వారిలో స్ప‌ష్టంగా మార్పులు క‌న‌బ‌డ‌తాయ‌ని  కూడా చాలామంది భావిస్తుంటారు. అందుకే పిల్ల‌లు విప‌రీతంగా ఏడ‌వటం, మారాం చేయ‌డాన్ని కూడా ఈ విష‌యంతో లింకుపెట్టి చెబుతుంటారు. అయితే ఇందులో నిజం లేదంటున్నారు కెన‌డాలోని ఈస్ట్ర‌న్ ఒంటారియో రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ప‌రిశోధ‌కులు. ముఖ్యంగా చంద్రునిలో వ‌చ్చే మార్పులు పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న‌, నిద్ర‌మీద ప్ర‌భావం చూపుతుందా…అనే విష‌యాన్ని వీరు […]

Advertisement
Update: 2016-05-14 06:28 GMT

చాలామంది న‌మ్ముతుంటారు ఈ విష‌యం. చంద్రుడిలో వ‌చ్చే హెచ్చుత‌గ్గులు మ‌న‌లో మార్పుల‌ను తీసుకువ‌స్తాయ‌ని, ముఖ్యంగా అమావాస్య‌, పౌర్ణ‌మి రోజుల్లో మాన‌సికంగా బ‌ల‌హీనంగా ఉన్న‌వారిలో స్ప‌ష్టంగా మార్పులు క‌న‌బ‌డ‌తాయ‌ని కూడా చాలామంది భావిస్తుంటారు. అందుకే పిల్ల‌లు విప‌రీతంగా ఏడ‌వటం, మారాం చేయ‌డాన్ని కూడా ఈ విష‌యంతో లింకుపెట్టి చెబుతుంటారు. అయితే ఇందులో నిజం లేదంటున్నారు కెన‌డాలోని ఈస్ట్ర‌న్ ఒంటారియో రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ప‌రిశోధ‌కులు. ముఖ్యంగా చంద్రునిలో వ‌చ్చే మార్పులు పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న‌, నిద్ర‌మీద ప్ర‌భావం చూపుతుందా…అనే విష‌యాన్ని వీరు ప‌రిశోధించారు. ఐదు ఖండాల‌కు చెందిన 5,800మంది పిల్లల మీద నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌లో… ఇందులో నిజం లేద‌ని తేలింది.

పిల్ల‌ల సామాజిక‌, ఆర్థిక, సాంస్కృతిక నేప‌థ్యం, వ‌య‌సు, ఆడా లేదా మ‌గా, రాత్రివేళ‌ల నిద్ర అల‌వాట్లు, శారీర‌క వ్యాయామ స్థాయి, త‌ల్లిదండ్రుల చ‌దువు త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. ఇర‌వై ఎనిమిది నెల‌ల పాటు, చంద్రునిలో వ‌స్తున్న‌ మార్పులు పిల్ల‌ల మీద ఎలాంటి ప్ర‌భావాన్ని చూపుతున్నాయి అనే అంశాల‌ను సునిశితంగా ప‌రిశీలించారు. పూర్తి చంద్రుడు, అర్థ చంద్రుడు, నెల‌పొడుపు స‌మ‌యాల్లో పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పుల‌ను గ‌మ‌నించారు. పౌర్ణమి రాత్రుల్లో పిల్ల‌లు, నెల‌పొడుపు రోజుల కంటే స‌గ‌టున ఒక అయిదు నిముషాలు త‌క్కువ నిద్ర‌పోయార‌ని, ఆ తేడా త‌ప్ప వారి మాన‌సిక రీతుల్లో ఎలాంటి తేడా లేద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. మ‌న మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న అనేది జీన్స్‌, చ‌దువు, ఆదాయం, మాన‌సిక ల‌క్ష‌ణాలు వీట‌న్నింటిమీద ఆధార‌ప‌డి ఉంటుంద‌ని, గురుత్వాక‌ర్ష‌ణ ప్ర‌భావం త‌క్కువే ఉంటుంద‌ని ఈ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

అయితే మ‌నిషి మాన‌సిక శారీర‌క ఆరోగ్యాల‌కు, చంద్రునికి సంబంధం ఉందా…అనేది పూర్తిగా తేల్చాలంటే మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని వారు అంటున్నారు.

Click on Image to Read:

 

 

 

 

Advertisement

Similar News