హోదాపై ప‌వ‌న్‌ను హేళ‌న చేస్తూ విరుచుకుప‌డ్డ వ‌ర్మ‌

న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తూ డైరెక్ట‌ర్ వ‌ర్మ మ‌రోసారి ట్వీట్ చేశారు. ఈసారి ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ అంశంపై ప‌వ‌న్‌ను వ‌ర్మ టార్గెట్ చేశారు. ఇక‌పై ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తూ ఎలాంటి ట్వీట్ చేయ‌న‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్‌బై అంటూ కొద్ది రోజుల క్రితం ట్వీట్ పెట్టిన వ‌ర్మ ఆ మాట‌ను ప‌క్క‌న పెట్టి మ‌రోసారి చెల‌రేగిపోయారు. వీరుడు అడుక్కోకూడ‌ద‌న్నారు. ”ఏ కాపులైతే మీకు ప‌వ‌ర్ ఇచ్చారో వాళ్ల‌ని మీ విన్న‌పాలతో బీద‌వాళ్ల‌ను చేశారు” అని అన్నారు. […]

Advertisement
Update: 2016-05-01 01:29 GMT

న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తూ డైరెక్ట‌ర్ వ‌ర్మ మ‌రోసారి ట్వీట్ చేశారు. ఈసారి ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ అంశంపై ప‌వ‌న్‌ను వ‌ర్మ టార్గెట్ చేశారు. ఇక‌పై ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తూ ఎలాంటి ట్వీట్ చేయ‌న‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్‌బై అంటూ కొద్ది రోజుల క్రితం ట్వీట్ పెట్టిన వ‌ర్మ ఆ మాట‌ను ప‌క్క‌న పెట్టి మ‌రోసారి చెల‌రేగిపోయారు.

వీరుడు అడుక్కోకూడ‌ద‌న్నారు. ”ఏ కాపులైతే మీకు ప‌వ‌ర్ ఇచ్చారో వాళ్ల‌ని మీ విన్న‌పాలతో బీద‌వాళ్ల‌ను చేశారు” అని అన్నారు. ”మీ అభిమానిగా మీ నోటి నుంచి హెచ్చ‌రిక‌లు వినాలి కానీ విన్న‌పాలు విన‌డం క‌ఠోరంగా ఉంది” అని ట్వీట్ చేశారు. ప్లాప్ అయినా త‌మ‌కు గబ్బ‌ర్‌సింగే కావాల‌ని.. బెగ్గర్ సింగ్ అవ‌స‌రం లేద‌న్నారు వ‌ర్మ‌. సినిమాల్లో ఓపెన్ వార్నింగులు ఇచ్చి నిజ‌జీవితంలో మాత్రం విన్న‌పాలు చేస్తే ప‌వ‌ర్‌కి, స్టార్‌కి మీనింగ్ ఏముంటుంద‌ని ప్ర‌శ్నించారు.

”అరే కేసీఆర్ నీ తాట తీస్తా అనే ప‌వ‌ర్ హీరో మాకు కావాలి కానీ విన్న‌పాలు కోరే ప‌వ‌ర్ లేని స్టార్ మాకొద్దు సార్” అని ట్వీట్ చేశారు. ”స్పెష‌ల్ స్టేట‌స్ డిమాండ్ చేస్తే వ‌స్తుంది గానీ విన్న‌పాల‌తో రాదు స‌ర్” అని సెటైర్ వేశారు. ”మిమ్మిల్ని అభిమానించే కాపుల‌తో పాటు రాజులు కూడా మీ విన్న‌పాల‌ను అస‌హ్యించుకుంటున్నార‌ని” వ‌ర్మ ట్వీట్ చేశారు. ఏపీ ప్రత్యేకహోదా కోసం ప్రయత్నించాలని, ప్రజలను మరోసారి మోసం చేయవద్దంటూ శనివారం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీనిపైనే వర్మ ట్వీట్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News