రాజీనామా చేస్తే హోదాలు వస్తాయా?‍

ప్రత్యేకహోదా ఏపీకి అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పినా టీడీపీ కేంద్రమంత్రులకు, పెద్దలకు చీమకుట్టినట్టుగా కూడా లేదనిపిస్తోంది. ప్రత్యేకహోదా సంగతేంటని కేంద్రమంత్రి సుజనా చౌదరిని విలేకర్లు ప్రశ్నించగా రివర్స్ లో సమాధానం చెప్పారు. మంత్రి పదవికి రాజీనామా చేసేస్తే ప్రత్యేకహోదా వచ్చేస్తుందా అని ప్రశ్నించి అందరికి షాక్ ఇచ్చారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని చెప్పారు. రాష్ట్రానికి ఏది ఉపయోగకరమో అదే చేస్తామని సుజనా చెప్పారు. అయితే అలా తీసుకొచ్చేందుకు ఎలాంటి కార్యాచరణను అనుసరించబోతున్నారన్నది మాత్రం […]

Advertisement
Update: 2016-05-01 12:28 GMT

ప్రత్యేకహోదా ఏపీకి అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పినా టీడీపీ కేంద్రమంత్రులకు, పెద్దలకు చీమకుట్టినట్టుగా కూడా లేదనిపిస్తోంది. ప్రత్యేకహోదా సంగతేంటని కేంద్రమంత్రి సుజనా చౌదరిని విలేకర్లు ప్రశ్నించగా రివర్స్ లో సమాధానం చెప్పారు. మంత్రి పదవికి రాజీనామా చేసేస్తే ప్రత్యేకహోదా వచ్చేస్తుందా అని ప్రశ్నించి అందరికి షాక్ ఇచ్చారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని చెప్పారు. రాష్ట్రానికి ఏది ఉపయోగకరమో అదే చేస్తామని సుజనా చెప్పారు. అయితే అలా తీసుకొచ్చేందుకు ఎలాంటి కార్యాచరణను అనుసరించబోతున్నారన్నది మాత్రం కేంద్రమంత్రి చెప్పలేదు.

మరోవైపు … విజయవాడలో జరిగిన చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు ప్రత్యేకహోదా అంశంపై స్పందించారు. ప్రజల కోసమే కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నామని చెప్పారు. విభజన హామీల అమలుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. మంత్రి పదవుల కోసం రాజీ పడే వ్యక్తిని తాను కాదని చంద్రబాబు చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News