గోవా అనుభవం… శరద్‌పవార్ సూచనను జగన్ ఫాలో అవుతారా!

సేవ్ డెమొక్రసీలో భాగంగా ఢిల్లీలో ఎస్పీపీ అధినేత శరద్‌పవార్‌ను జగన్‌ కలిశారు. ఈసందర్భంగా ఆయన జగన్‌కు కొన్ని సలహాలు ఇచ్చారు.  ఫిరాయింపు వల్ల గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను, వాటిని అధిగమించిన తీరును వివరించారు. గతంలో గోవా రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా అధికార పార్టీ కొనుగోలు చేసిందని శరద్‌పవార్… జగన్‌తో చెప్పారు. కానీ అప్పట్లో తాము రాజీలేని పోరాటం చేశామన్నారు. ఫిరాయింపులపై తొలుత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు వరకు వెళ్లామన్నారు. తాము […]

Advertisement
Update: 2016-04-26 22:14 GMT

సేవ్ డెమొక్రసీలో భాగంగా ఢిల్లీలో ఎస్పీపీ అధినేత శరద్‌పవార్‌ను జగన్‌ కలిశారు. ఈసందర్భంగా ఆయన జగన్‌కు కొన్ని సలహాలు ఇచ్చారు. ఫిరాయింపు వల్ల గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను, వాటిని అధిగమించిన తీరును వివరించారు.

గతంలో గోవా రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా అధికార పార్టీ కొనుగోలు చేసిందని శరద్‌పవార్… జగన్‌తో చెప్పారు. కానీ అప్పట్లో తాము రాజీలేని పోరాటం చేశామన్నారు. ఫిరాయింపులపై తొలుత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు వరకు వెళ్లామన్నారు. తాము పార్టీ ఫిరాయించలేదని కేవలం కండువా మాత్రమే మార్చుకున్నామని ఎమ్మెల్యే బుకాయించినా చివరకు వేటు వేయించగలిగామని శరద్‌పవార్ గుర్తు చేశారు. వైసీపీ కూడా ఇదే దారిలో పోరాటం చేయాలని జగన్‌కు సలహా ఇచ్చారు. ఫిరాయింపులపై వైసీపీ చేసే పోరాటానికి తాము అండగా నిలుస్తామని చెప్పారు.

మరో కీలక విషయాన్ని కూడా శరద్ పవార్ చెప్పారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 26ను సవరించడం ద్వారా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు సాధ్యం కాదని వెల్లడించారు. అవసరమైతే రాజ్యాంగసవరణే చేయాల్సి ఉంటుందన్నారు. అది చాలా కష్టమైన పని అని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ స్థానాల పెంపును ఆశగా చూపించి ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని శరద్ పవార్ అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News