సాక్షి డైరెక్టర్లపై తదుపరి చర్యలు నిలిపివేత

రాజధాని భూ కుంభకోణాలపై సాక్షి కథనాలు తమ పరువుకు నష్టం కలిగించాయంటూ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై సాక్షి డైరెక్టర్లకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుల్లో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో భూకుంభకోణాలు చేశారంటూ సాక్షి రాసిన కథనాలపై టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్లు యర్రంరెడ్డి ఈశ్వర్ ప్రసాదరెడ్డి, కాల్వ రాజప్రసాదరెడ్డి, పి.వెంకటకృష్ణ ప్రసాద్, ఎడిటోరియల్ డెరైక్టర్ […]

Advertisement
Update: 2016-04-26 12:45 GMT

రాజధాని భూ కుంభకోణాలపై సాక్షి కథనాలు తమ పరువుకు నష్టం కలిగించాయంటూ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై సాక్షి డైరెక్టర్లకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుల్లో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో భూకుంభకోణాలు చేశారంటూ సాక్షి రాసిన కథనాలపై టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్లు యర్రంరెడ్డి ఈశ్వర్ ప్రసాదరెడ్డి, కాల్వ రాజప్రసాదరెడ్డి, పి.వెంకటకృష్ణ ప్రసాద్, ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పత్రిక రోజూ వారి వ్యవహారాలతో కంపెనీ డెరైక్టర్లకు ఎటువంటి సంబంధం ఉండదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ఈ విషయం తెలిసి కూడా పోలీసులు కావాలనే అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి కేసులు పెట్టారని కోర్టుకు వివరించారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ కేసుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేశారు. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని టీడీపీ నేతలు నారాయణ, సుజనా చౌదరి, లోకేష్, దూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్ తదితరులు భారీగా అమరావతిలో భూములు కొన్నారని, ఇన్‌ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సాక్షి ప్రతిక కొద్ది రోజుల కితం వరుస కథనాలు రాసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News