అత్తరుకు చెప్పుల దండలు… కందిపోయిన కందికుంట ప్రసాద్

కదిరి వైసీపీ ఎమ్మెల్యే అత్తరు చాంద్ బాషా టీడీపీలో చేరడంపై వైసీపీ కార్యకర్తలు, మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరిలోని చాంద్ బాషా లాడ్జి ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధికార పార్టీకి అమ్ముడుపోయి ముస్లింల పరువు తీశావంటూ మైనార్టీలు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. చాంద్ బాషా ఫొటోకు చెప్పుల దండలేసి ఊరేగించారు. మరోవైపు చాంద్ బాషా రాకతో కదిరి  టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. బాషాను చేర్చుకోవడంపై  టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆగ్రహం […]

Advertisement
Update: 2016-04-23 03:20 GMT

కదిరి వైసీపీ ఎమ్మెల్యే అత్తరు చాంద్ బాషా టీడీపీలో చేరడంపై వైసీపీ కార్యకర్తలు, మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరిలోని చాంద్ బాషా లాడ్జి ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధికార పార్టీకి అమ్ముడుపోయి ముస్లింల పరువు తీశావంటూ మైనార్టీలు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. చాంద్ బాషా ఫొటోకు చెప్పుల దండలేసి ఊరేగించారు.

మరోవైపు చాంద్ బాషా రాకతో కదిరి టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. బాషాను చేర్చుకోవడంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ప్రసాద్‌ను బుజ్జగిస్తున్నారు. ఉదయం కందికుంట ప్రసాద్‌ను మంత్రి పరిటాల సునీత … చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు. చాలాసేపు ప్రసాద్‌ను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయినా ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదు. చాంద్ బాషాను తీసుకురావడం అంటే ఇన్‌చార్జ్‌గా తాను విఫలమయ్యానని చాటిచెప్పడమేనని ప్రసాద్ అంటున్నారు. తనను తీవ్రంగా అవమానించారని ఆగ్రహంగా ఉన్నారు.

చంద్రబాబు బుజ్జగించినప్పటికీ చాంద్ బాషా టీడీపీ కండువా కప్పుకోవడానికి ముందే కందికుంట ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి డబ్బులకు అమ్ముడుపోయే చాంద్ బాషా లాంటి వారికి అధినాయకత్వం పెద్దపీట వేయడం ఏమిటని ప్రసాద్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News