జగన్ ఆస్తుల కేసులో బాలాజీపై విచారణ నిలిపివేత

జగన్ ఆస్తుల కేసు నుంచి ఒక్కోక్కరు బయటపడుతున్నారు. సీబీఐ చేసిన అభియోగాల్లో పసలేకపోవడంతో నిందితులుగా ఉన్న వారిపై విచారణను కోర్టులు నిలిపివేస్తున్నాయి. తాజాగా లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ కేసులో నిందితుడిగా ఉన్న హబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస బాలాజీపై విచారణను ఉమ్మడి హైకోర్టు నిలిపివేసింది.  సీబీఐ కోర్టులో ఆయనపై జరుగుతున్న విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసింది.  సీబీఐ తనపై తప్పుడు కేసు మోపిందని దాన్ని కొట్టివేయాలని బాలాజీ కోర్టును ఆశ్రయించారు.  తాను […]

Advertisement
Update: 2016-04-19 23:16 GMT

జగన్ ఆస్తుల కేసు నుంచి ఒక్కోక్కరు బయటపడుతున్నారు. సీబీఐ చేసిన అభియోగాల్లో పసలేకపోవడంతో నిందితులుగా ఉన్న వారిపై విచారణను కోర్టులు నిలిపివేస్తున్నాయి. తాజాగా లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ కేసులో నిందితుడిగా ఉన్న హబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస బాలాజీపై విచారణను ఉమ్మడి హైకోర్టు నిలిపివేసింది. సీబీఐ కోర్టులో ఆయనపై జరుగుతున్న విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. సీబీఐ తనపై తప్పుడు కేసు మోపిందని దాన్ని కొట్టివేయాలని బాలాజీ కోర్టును ఆశ్రయించారు. తాను లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో ఉద్యోగిని మాత్రమేనని ఆ విషయాన్ని సీబీఐ చార్జిషీటే చెబుతోందని పిటిషనర్ వాదించారు. వాదనల అనంతరం శ్రీనివాస బాలాజీపై కేసు విచారణను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News