జగన్‌ హస్తం లేదు... బానిసల్లా సర్టిఫికేట్ ఇవ్వండి

కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. కాపులను చంద్రబాబు బానిసల్లా చూస్తున్నారని మండిపడ్డారు. కాపులను ప్రభుత్వం పాకిస్తాన్ వాళ్లను చూసినట్టుగా చూస్తోందన్నారు. మా జాతి ఓట్లతోనే చంద్రబాబు సీఎం అయ్యారని… ఆ కృతజ్ఞత కూడా లేకుండా వేధిస్తున్నారని విమర్శించారు. తుని సభకు వచ్చిన కాపులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. అనంతపుంలో పర్యటించిన ముద్రగడ… తుని ఘటన వెనుక జగన్‌ హస్తం ఉందని తప్పుడు ప్రచారంచేస్తున్నారని అన్నారు. జగన్‌ దగ్గర సలహాలు […]

Advertisement
Update: 2016-04-17 01:38 GMT

కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. కాపులను చంద్రబాబు బానిసల్లా చూస్తున్నారని మండిపడ్డారు. కాపులను ప్రభుత్వం పాకిస్తాన్ వాళ్లను చూసినట్టుగా చూస్తోందన్నారు. మా జాతి ఓట్లతోనే చంద్రబాబు సీఎం అయ్యారని… ఆ కృతజ్ఞత కూడా లేకుండా వేధిస్తున్నారని విమర్శించారు. తుని సభకు వచ్చిన కాపులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.

అనంతపుంలో పర్యటించిన ముద్రగడ… తుని ఘటన వెనుక జగన్‌ హస్తం ఉందని తప్పుడు ప్రచారంచేస్తున్నారని అన్నారు. జగన్‌ దగ్గర సలహాలు తీసుకునేంత చిన్న వయసు తనది కాదన్నారు. కాపులను చంద్రబాబు బానిసల్లాగే చూడాలనుకుంటే ఆ మేరకు కాపులకు బానిసలంటూ సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు. కాపులను సంఘవిద్రోహక శక్తులుగా చూస్తున్నారని విమర్శించారు. కాపులు సభలు పెట్టుకుంటే ఇబ్బందులు వస్తాయంటే కనీసం పోలీస్ స్టేషన్లలోనే సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపు జాతిపై టీడీపీ పెద్దలు తప్పుడు ప్రచారం మానకోవాలని ముద్రగడ కోరారు. జూన్‌ తర్వాత కాపు ఉద్యమంపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని బ్రిటిష్ వాళ్లే గుర్తించినా చంద్రబాబు మాత్రం గుర్తించడం లేదన్నారు. కాపు నాయకులపై నిఘా ఉంచడం మానుకోవాలని డిమాండ్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News