వారు వెళ్తేనే మేం బాగుపడుతాం, ఫిరాయింపుదారులకు పెద్దిరెడ్డి సవాల్

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కి లొంగి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. సుజయ్‌ కృష్ణరంగారావు పార్టీ వీడడం ఖాయమైనప్పటికీ చివరి ప్రయత్నంగా విజయసాయిరెడ్డి ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. విజయనగరంలోని బొబ్బిలి రాజుల కోటకు వెళ్లారు. అయితే సుజయ్‌ కృష్ణ అందుబాటులోకి రాలేదు. దీంతో.. సాలూరు ఎమ్మెల్యే నివాసంలో విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ధర్మాన కృష్ణదాసులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ వీడి వెళ్లేవారు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని విజయసాయిరెడ్డి అన్నారు. అటు విజయవాడలో అంబేడ్కర్ జయంతి […]

Advertisement
Update: 2016-04-14 04:21 GMT

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కి లొంగి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. సుజయ్‌ కృష్ణరంగారావు పార్టీ వీడడం ఖాయమైనప్పటికీ చివరి ప్రయత్నంగా విజయసాయిరెడ్డి ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. విజయనగరంలోని బొబ్బిలి రాజుల కోటకు వెళ్లారు. అయితే సుజయ్‌ కృష్ణ అందుబాటులోకి రాలేదు. దీంతో..

సాలూరు ఎమ్మెల్యే నివాసంలో విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ధర్మాన కృష్ణదాసులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ వీడి వెళ్లేవారు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని విజయసాయిరెడ్డి అన్నారు.

అటు విజయవాడలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా పార్టీ ఫిరాయింపుదారులకు పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తిన్నింటివాసాలు లెక్కపెట్టేవారు వెళ్లిపోవడం వల్ల పార్టీకి మంచే జరుగుతుందన్నారు.

పది మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. జగన్‌ ఎవరికీ గౌరవం ఇవ్వరంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేయిస్తోందని పెద్దిరెడ్డి విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News