మంత్రి కామినేనికి ఉద్వాసన?

త్వరలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, అందుకోసం ఎంతటి త్యాగానికైనా మేం సిద్ధం అని కొందరు టీడీపీ నాయకులు శివాలు తొక్కుతున్నారు. చంద్రబాబు ఆశించిన విధంగా పని చేయలేకపోతున్న ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చునని, కొందరి పోర్టు పోలియోలు మారవచ్చని రాజకీయ పండితుల అంచనా! ఇటీవల వైసీపీ నుంచి జంప్‌ చేసిన ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పాత వార్తలే! తాజాగా […]

Advertisement
Update: 2016-04-07 21:00 GMT

త్వరలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, అందుకోసం ఎంతటి త్యాగానికైనా మేం సిద్ధం అని కొందరు టీడీపీ నాయకులు శివాలు తొక్కుతున్నారు.

చంద్రబాబు ఆశించిన విధంగా పని చేయలేకపోతున్న ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చునని, కొందరి పోర్టు పోలియోలు మారవచ్చని రాజకీయ పండితుల అంచనా!

ఇటీవల వైసీపీ నుంచి జంప్‌ చేసిన ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవన్నీ పాత వార్తలే!

తాజాగా వీటికి మరో కొత్త వార్త జత అయిది.

మంత్రి కామినేని శ్రీనివాస్‌ గతంలో ఎన్నడూ బిజేపి మనిషి కాదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ లోనో, విశ్వహిందూ పరిషత్‌లోనో పనిచేసిన అనుభవం కూడా లేదు. ఉంటే గింటే తన సామాజిక వర్గ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఉండవచ్చు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తన అభ్యర్థులందరికీ సీట్లు కేటాయించలేక దొడ్డిదారిన బిజెపిలోకి పంపి, బిజెపి అభ్యర్థిగా పోటీలోకి దింపి, గెలిపించుకున్న చంద్రబాబు స్వంత మనిషి కామినేని అని కొందరు బిజెపి వీరాభిమానుల విమర్శ.

ఆ విమర్శకులే ఇప్పుడు కామినేని గురించి బిజెపి అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేస్తున్నారట.

కామినేని పేరుకు బిజెపిలో ఉన్నా టీడీపీ వీరాభిమానిలాగా వ్యవహరిస్తున్నాడని, చివరికి బిజెపి సమావేశాల్లోనూ టీడీపీ తరుపున వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నాడని బిజెపి అభిమానులు మండిపడుతున్నారు. బిజెపి నాయకులైతే కామినేని టీడీపీ తరుపున, చంద్రబాబు తరుపున మాట్లాడడం మాని మోడీ తరుపున, బిజెపి తరుపున మాట్లాడాలని కామినేనికి సలహాకూడా ఇచ్చారట.

ఈ నేపథ్యంలో కొందరు బిజెపి కీలక నాయకులు కామినేనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తూ, వచ్చే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కామినేనిని తప్పించి, ఆయన స్థానంలో మరో బిజెపి నాయకుడిని మంత్రి పదవికి పార్టీ తరపున సిఫార్సు చేయాలని సూచించినట్టు తెలిసింది.

బిజెపి వాళ్ళ కోరికను ఆమోదించి బిజేపి కోటాలో మరో వ్యక్తిని మంత్రి పదవికి సిఫార్సు చేస్తుందా? చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News