క్రమశిక్షణా… కాకరకాయా… ‘’ఇంటికొచ్చి కొడుతా!’’

తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని టీడీపీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటుంటాయి. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం క్రమశిక్షణ సంగతి దేవుడెరుగు… కనీసం పెద్ద నాయకులు కూడా ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవడం మానేశారు. మైకుల ముందే కొడుతా… కుమ్మేస్తా అని వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది.  టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా జేసీ బ్రదర్స్,  ప్రభాకర్ చౌదరి […]

Advertisement
Update: 2016-04-06 21:00 GMT

తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని టీడీపీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటుంటాయి. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం క్రమశిక్షణ సంగతి దేవుడెరుగు… కనీసం పెద్ద నాయకులు కూడా ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవడం మానేశారు. మైకుల ముందే కొడుతా… కుమ్మేస్తా అని వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా జేసీ బ్రదర్స్, ప్రభాకర్ చౌదరి వర్గం ఘర్షణ పడుతూనే ఉంది.

తాజాగా ఆర్యవైశ్యులకు చెందిన వాసవి కల్యాణమండపాన్ని కార్పొరేషన్ అధికారులు సీజ్‌ చేయడంతో వివాదం తలెత్తింది. పన్నులు కట్టలేదని మండపాన్ని సీజ్ చేయడం వెనుక నగర మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హస్తముందని అందరూ చెప్పుకుంటున్నారు. సీజ్‌కు నిరసనగా ఆర్యవైశ్యులు భారీ ర్యాలీగా వెళ్లి కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వీరి ఆందోళనకు జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అయితే ఆందోళన సమయంలో జేసీ అనుచరుడు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి కిందపడి గాయపడ్డారు. ఆయను పరామర్శించేందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి … ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘’ నేను అనుకుంటే వాడి ఇంటికాడికి వెళ్లి కొడుతా’’ అని హెచ్చరించారు.

ఇందుకు చౌదరి కూడా తీవ్రంగా స్పందించారు. తనను కొట్టాలంటే మరో జన్మ ఎత్తాలని అన్నారు. తమ నేతలే ఈస్థాయిలో విమర్శలు చేసుకునే సరికి వారి అనుచరులు రంగంలోకి దిగారు. తమ నాయకుడు అనంతపురంలో రాజకీయాలు చేయడం మొదలుపెడితే తట్టుకోలేరని జేసీ ప్రభాకర రెడ్డి అనుచరులు తాడిపత్రిలో ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించారు. ఇందుకు అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి మేయర్ స్వరూప వర్గీయులు కౌంటర్ ఇచ్చారు. అనంతపురం పాతూరులో రోడ్డు విస్తరణ విషయంలోనూ వీరి మధ్య గొడవ నడుస్తోంది.

అత్యంత ఇరుకైన ప్రాంతంగా ఉన్న పాతూరులో రోడ్డు విస్తరణకు జేసీ దివాకర్ రెడ్డి రూ.80 కోట్ల నిధులు కూడా మంజూరు చేయించారు. అయితే ఇందుకు ప్రభాకర చౌదరి అడ్డుపడుతున్నారు. రోడ్డు విస్తరణ జరగదని ఎన్నికల సమయంలో ఆ ప్రాంత ఓటర్లకు హామీ ఇచ్చానని ప్రభాకర్ చౌదరి అడ్డుపడ్డారు. అలా ప్రతివిషయంలోనూ ఇరు వర్గాలు ఒకరి మాటకు ఒకరు ఎదురుచెబుతూ అడ్డుపడుతున్నారు. వీరి తీరు చూసిన జిల్లా ప్రజలు పార్టీలో క్రమశిక్షణా… కాకరకాయ అని ఎద్దేవా చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News