సీఎం దగ్గరకైనా వెళ్తా… పార్టీ మారను- వైసీపీ ఎమ్మెల్యే

తనను ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలపై వైసీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్పందించారు. టీడీపీలోకి రావాల్సిందిగా తనపై రాయపాటితో పాటు టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే అందుకు తన మనస్సాక్షి అంగీకరించడం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కొందరు టీడీపీ నేతలను కలవాల్సి వస్తోందన్నారు.  ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేతలతో సరదాగా ఉంటూ పనులు చేయించుకుంటున్నానని అన్నారు.  ఓట్లేసి నియోజకవర్గ ప్రజల అభివృధ్ధి […]

Advertisement
Update: 2016-04-05 21:00 GMT

తనను ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలపై వైసీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్పందించారు. టీడీపీలోకి రావాల్సిందిగా తనపై రాయపాటితో పాటు టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే అందుకు తన మనస్సాక్షి అంగీకరించడం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కొందరు టీడీపీ నేతలను కలవాల్సి వస్తోందన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేతలతో సరదాగా ఉంటూ పనులు చేయించుకుంటున్నానని అన్నారు. ఓట్లేసి నియోజకవర్గ ప్రజల అభివృధ్ధి కోసం కొందరి దగ్గరకు వెళ్లి కాళ్లవేళ్ల పడి నిధులు తెచ్చుకుంటున్నానని అన్నారు. పార్టీ అయితే ప్రస్తుతానికి మారే ఉద్దేశం లేదని … వైసీపీలో ఉంటూనే పనులు జరిగేలా చూసుకుంటానని అన్నారు. గతంలో వెంకయ్యనాయుడు కూడా బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్టు చెప్పారు. సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు రాయపాటి సిద్ధమయ్యారట కదా అన్న ప్రశ్నకు స్పందించిన ముస్తఫా సీఎం దగ్గరకు వెళ్లినా నియోజకవర్గం కోసమే వెళ్లానని… పార్టీ మారేందుకు మాత్రం తన మనస్సాక్షి అంగీకరించడం లేదన్నారు. అయితే ముస్తఫా మనస్సాక్షి ప్రస్తుతానికేనా… భవిష్యత్తులోనూ మారదా అన్నది చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News