రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన బుద్దా వెంకన్న

నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు రావడమే ఆలస్యం టీడీపీ నేతలు తమ వంతు స్వామి భక్తి చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. లోకేష్ కేబినెట్‌లోకి తీసుకోవాల్సిందేనని సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేయగా… తాజాగా కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరో అడుగు ముందుకేశారు. లోకేష్ కోసం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి తన రాజీనామా లేఖ అందజేస్తానన్నారు.  తన స్థానం నుంచి లోకేష్‌ను ఎమ్మెల్సీగా పోటీ […]

Advertisement
Update: 2016-04-05 07:41 GMT

నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు రావడమే ఆలస్యం టీడీపీ నేతలు తమ వంతు స్వామి భక్తి చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. లోకేష్ కేబినెట్‌లోకి తీసుకోవాల్సిందేనని సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేయగా… తాజాగా కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరో అడుగు ముందుకేశారు. లోకేష్ కోసం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

బుధవారం సీఎం చంద్రబాబును కలిసి తన రాజీనామా లేఖ అందజేస్తానన్నారు. తన స్థానం నుంచి లోకేష్‌ను ఎమ్మెల్సీగా పోటీ చేయించాలని కోరుతానన్నారు. లోకేష్ తప్పకుండా గెలుస్తారని మంత్రి పదవి చేపడుతారని ఆయన అన్నారు . అయితే పత్రికల్లో వచ్చిన వార్తలకే ఈ రేంజ్‌లో స్పందించాల్సిన అవసరం ఉందా అని కొందరు టీడీపీ నేతలే ప్రశ్నస్తున్నారు. అవకాశం వస్తే చాలు స్వామిభక్తి చాటుకునేందుకు సిద్ధమైపోతున్నారని సెటైర్లు వేస్తున్నారు. నిజంగా బుధవారం సీఎంను బుద్దా వెంకన్న కలుస్తారా?. రాజీనామా లేఖ ఇస్తారా?. దాన్ని చంద్రబాబు ఆమోదిస్తారా?. చూడాలి.

ఉదయం సోమిరెడ్డి కూడా లోకేష్ విషయంలో ఇలాగే స్పందించారు. యువత రాజకీయాల్లోకి రావాలని అందులో భాగంగా లోకేష్ మంత్రి పదవి చేపట్టాల్సిందేనని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి నవ్యాంధ్ర నిర్మాణంలో నిస్వార్థంగా పని చేస్తారని సోమిరెడ్డి చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News