జగన్ జపం అందుకున్న చింతామోహన్‌,.. కానీ ఆశకు హద్దుండాలిగా?

అత్త చచ్చిన ఆరేళ్లకు బాధపడిన్టటుగా ఉంది ఏపీ కాంగ్రెస్ నేతల తీరు. ఒకప్పుడు జగన్‌ను కేసులు పెట్టి వెంటాడిన కాంగ్రెస్ నేతలకు తమ తప్పు ఏంటో బాగానే తెలిసొచ్చింది. ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోవడం… ఆ ప్లేస్‌లో వైసీపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిపోవడం జరిగిపోయింది. కానీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కొత్త స్లోగన్ వినిపిస్తున్నారు. జగన్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వాస్తామని  నెల్లూరులో మీడియాకు చెప్పారు. జగన్‌తో పాటు  హీరో పవన్‌ కల్యాణ్‌ను కూడా కాంగ్రెస్ […]

Advertisement
Update: 2016-03-31 06:34 GMT

అత్త చచ్చిన ఆరేళ్లకు బాధపడిన్టటుగా ఉంది ఏపీ కాంగ్రెస్ నేతల తీరు. ఒకప్పుడు జగన్‌ను కేసులు పెట్టి వెంటాడిన కాంగ్రెస్ నేతలకు తమ తప్పు ఏంటో బాగానే తెలిసొచ్చింది. ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోవడం… ఆ ప్లేస్‌లో వైసీపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిపోవడం జరిగిపోయింది. కానీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కొత్త స్లోగన్ వినిపిస్తున్నారు.

జగన్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వాస్తామని నెల్లూరులో మీడియాకు చెప్పారు. జగన్‌తో పాటు హీరో పవన్‌ కల్యాణ్‌ను కూడా కాంగ్రెస్ లోకి తీసుకెళ్తారట. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం అవసరం వుందని చింతామోహన్ చెప్పారు. ఈ వైపుగా కాంగ్రెస్ హైకమాండ్‌ కూడా దృష్టి సారించిందన్నారు.

అయినా చింతమోహన్ అత్యాశ కాకపోతే… అంతుచిక్కనంత లోతులో కాంగ్రెస్‌ను ఏపీ జనం పాతేశారు. అలాంటి పార్టీలోకి జగన్‌ ఎందుకు వస్తారు?. అధికారంలోకి రాలేకపోయారే గానీ బలమైన పార్టీగా ఏపీలో వైసీపీ ఉంది. అలాంటిది జగన్ కాంగ్రెస్ లోకి రావడం సాధ్యమేనా?. ఇక పవన్ కల్యాణ్‌ నడిపితే సొంత పార్టీ నడుపుతారు లేదంటే ఏ బీజేపీలోకో వెళ్తారే గానీ కాంగ్రెస్‌లోని వచ్చేంత తెలివితక్కువ ఎత్తుగడ వేస్తారా?. పార్టీలో ఉన్న చిరంజీవినే వాడుకోలేనప్పుడు ఇక పవన్‌ను తీసుకుని ఏం చేసుకుంటారో?. జగన్, పవనే కాదు అసలు ఏ నేత కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా లేని పరిస్థితి. జగన్ ను కాంగ్రెస్ లోకి తీసుకురావడం కన్నా… కాంగ్రెస్ లో ఉన్న నేతలే వైసీపీలో చేరడం ఈజీ.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News