కులాలు, ప్రాంతాలపై చంద్రబాబు నోట ఆసక్తికర వ్యాఖ్యలు

‘’రాయలసీమ రౌడీలు”, “పులివెందుల గూండాలు”, “తునిలో రైలు తగలబెట్టింది రాయలసీమ గూండాలే’’, ‘’రాయలసీమ వాళ్లు గొడ్డుకారం తినేవారు… ఎన్టీఆర్ వచ్చాక రెండురూపాయలకు కిలో బియ్యం ఇచ్చి వారు మూడు పూటలా అన్నం తినేలా చేశారు’’. ‘’రాయలసీమ వాళ్లు గోదావరి ఎలా ఉంటుందో చూసి ఉండరు. వెళ్లి చూసిరండి’’. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. వివిధ సందర్భాల్లో చంద్రబాబే స్వయంగా సెలవిచ్చిన వ్యాఖ్యలు. బహుశా రాయలసీమ ప్రాంతాన్ని నెగిటివ్‌ టచ్‌లో ఇన్నిసార్లు కామెంట్ చేసింది ఈ మధ్య కాలంలో చంద్రబాబు తప్ప […]

Advertisement
Update: 2016-03-31 01:00 GMT

‘’రాయలసీమ రౌడీలు”, “పులివెందుల గూండాలు”, “తునిలో రైలు తగలబెట్టింది రాయలసీమ గూండాలే’’, ‘’రాయలసీమ వాళ్లు గొడ్డుకారం తినేవారు… ఎన్టీఆర్ వచ్చాక రెండురూపాయలకు కిలో బియ్యం ఇచ్చి వారు మూడు పూటలా అన్నం తినేలా చేశారు’’. ‘’రాయలసీమ వాళ్లు గోదావరి ఎలా ఉంటుందో చూసి ఉండరు. వెళ్లి చూసిరండి’’. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. వివిధ సందర్భాల్లో చంద్రబాబే స్వయంగా సెలవిచ్చిన వ్యాఖ్యలు. బహుశా రాయలసీమ ప్రాంతాన్ని నెగిటివ్‌ టచ్‌లో ఇన్నిసార్లు కామెంట్ చేసింది ఈ మధ్య కాలంలో చంద్రబాబు తప్ప మరొకరు ఉండరు. కానీ శాసనమండలిలో చంద్రబాబు ప్రసంగం చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు.

కొందరు మేధావులు హైదరాబాద్‌లో కూర్చుని ప్రాంతాల వారీగా మాట్లాడుతున్నారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృధ్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ది అంటూ ప్రాంతాల వారిగా మాట్లాడుతున్నారని అది తగదని చెప్పారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు మాటలు విని పెద్దల సభలోని పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా… మొత్తం అన్ని సంస్థలను తనకు ఇష్టమైన అమరావతిలోనే నెలకోల్పుతున్నారు. చివరకు అనంతపురానికి వస్తుందనుకున్న ఎయిమ్స్‌ను కూడా తీసుకెళ్లి అమరావతిలోనే శంకుస్థాపన చేశారు. అలాంటి బాబు నోట ఈ వ్యాఖ్యలు రావడం చూసి ఆశ్చర్యపోయారు.

కులాలపైనా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో కులరాజకీయాలు మంచిది కాదని చెప్పారు. కొన్ని యూనివర్శిటీలలో కుల సంఘాలు బ్లాకుల వారీగాకూడా ఉన్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇదేం పిచ్చి అని ఆయన అన్నారు. నిజంగా చంద్రబాబు వచ్చిందే వర్శిటీ కుల రాజకీయాల నుంచి. అప్పట్లో ఒక సామాజికవర్గం విద్యార్థులను వెంటేసుకుని చంద్రబాబు తిరిగే వారని రాష్ట్రంలోని ప్రముఖ కమ్యూనిస్టు నేత నారాయణ స్వయంగా చెప్పారు.

వర్శిటీల్లో కులకుంపట్లను పోగొట్టాలనుకుంటే మొదట ఆయన దృష్టి పెట్టాల్సింది నాగార్జున వర్శిటీపైనే. అధికార బలంతో కొన్ని వర్గాలు అక్కడ ఎంతగా రెచ్చిపోతున్నాయో రిషితేశ్వరి ఘటనే నిదర్శనం. పైగా కులాల వారీగా వాగ్దానాలు ఇచ్చి… కులాల వారీగా నేతలను విభజించి వాడుకునే చంద్రబాబు నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News