రాయలసీమ వాళ్లు గోదావరి చూసి ఉండరు… వెళ్లి చూడండి- చంద్రబాబు

పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశామంటూ ఆ అంశంపై ప్రభుత్వం సభలో చర్చ పెట్టింది. ఈసందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య  వాగ్వాదం జరిగింది.  ప్రతిపక్షానికి కనీసం అవగాహన లేకుండాపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అసలు పట్టిసీమ ఎక్కడుందో ప్రతిపక్ష సభ్యులకు తెలుసా అని ప్రశ్నించారు. కనీసం గోదావరి నదినైనా చూశారా అని ఎద్దేవా చేశారు. ఒకసారి వెళ్లి చూడండి అని సూచించారు. ప్రతిపక్ష సభ్యుల వైపు చూస్తూ రాయలసీమవాళ్లు గోదావరి నదిని చూసి ఉండరు… అని చంద్రబాబు  నవ్వుతూ […]

Advertisement
Update: 2016-03-29 04:59 GMT

పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశామంటూ ఆ అంశంపై ప్రభుత్వం సభలో చర్చ పెట్టింది. ఈసందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతిపక్షానికి కనీసం అవగాహన లేకుండాపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అసలు పట్టిసీమ ఎక్కడుందో ప్రతిపక్ష సభ్యులకు తెలుసా అని ప్రశ్నించారు. కనీసం గోదావరి నదినైనా చూశారా అని ఎద్దేవా చేశారు. ఒకసారి వెళ్లి చూడండి అని సూచించారు. ప్రతిపక్ష సభ్యుల వైపు చూస్తూ రాయలసీమవాళ్లు గోదావరి నదిని చూసి ఉండరు… అని చంద్రబాబు నవ్వుతూ సెటైర్లు చేశారు. కనీసం గోదావరి పుష్కరాల సమయంలోనైనా వెళ్లి ఉంటే పుణ్యమైనా దక్కేదన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని పట్టిసీమ ద్వారా తెచ్చి… శ్రీశైలంలో నీటిని ఆపి రాయలసీమకు నీరుస్తుంటే అడ్డుపడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదిలో నీరు రావడం లేదన్నారు. కనీసం తాగేందుకు కూడా కృష్ణా నీరు సరిపోవడం లేదన్నారు. చంద్రబాబు అతిశయోక్తులు, ఆచరణ సాధ్యంకాని విషయాలు చెబుతుంటే జగన్, వైసీపీ సభ్యులు నవ్వుతూ కూర్చున్నారు. జగన్ సభలో నవ్వుతూ ఉంటారని ఆ నవ్వు ఎందుకో తనకు అర్థం కావడం లేదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News