ప్రేమోన్మాదానికి బలైన వాలీబాల్ క్రీడాకారిణి!
ఓ ఉన్మాది ప్రేమ ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక క్రీడాకారిణిని పొట్టనపెట్టుకుంది. జాతీయ స్థాయిలో రాణిస్తున్న వాలీబాల్ క్రీడాకారిణి సంగీతా అయిచ్ (15)ని సుబ్రతా సిన్హా (20) అనే మరో సీనియర్ ఆటగాడు దారుణంగా హత్యచేశాడు. తన ప్రేమను కాదన్నదన్న కక్షతోనే అతను ఈ హత్యచేసినట్టుగా తెలుస్తోంది. 25మంది క్రీడాకారులు, ముగ్గురు కోచ్‌లు చూస్తుండగానే ఈ హత్య జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా, బర్సాత్ లో దారుణం చోటుచేసుకుంది. శనివారం సబ్ జూనియర్ […]
ఓ ఉన్మాది ప్రేమ ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక క్రీడాకారిణిని పొట్టనపెట్టుకుంది. జాతీయ స్థాయిలో రాణిస్తున్న వాలీబాల్ క్రీడాకారిణి సంగీతా అయిచ్ (15)ని సుబ్రతా సిన్హా (20) అనే మరో సీనియర్ ఆటగాడు దారుణంగా హత్యచేశాడు. తన ప్రేమను కాదన్నదన్న కక్షతోనే అతను ఈ హత్యచేసినట్టుగా తెలుస్తోంది. 25మంది క్రీడాకారులు, ముగ్గురు కోచ్‌లు చూస్తుండగానే ఈ హత్య జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా, బర్సాత్ లో దారుణం చోటుచేసుకుంది. శనివారం సబ్ జూనియర్ టోర్నమెంటులో పాల్గొనాల్సి ఉండగా సంగీత, శుక్రవారం ప్రాక్టీస్ క్యాంప్‌కి వెళ్లింది. అక్కడకు వచ్చిన సుబ్రతా, సంగీతతో గొడవ పెట్టుకున్నాడు. కోచ్ స్వపన్ దాస్ పక్కన కూర్చుని ఉన్న సంగీత లేచి అవతలికి వెళ్లింది. ఇద్దరూ గొడవ పడటం అక్కడున్న వారంతా చూస్తూనే ఉన్నారు.అయితే హఠాత్తుగా సుబ్రతా కత్తితీసి ఆమెమీద దాడికి దిగాడు. అడ్డువెళ్లిన స్వపన్ దాస్‌కి కూడా గాయాలయ్యాయి. అంతా సుబ్రతాని పట్టుకునేందుకు పరిగెడుతుండగానే అతను సంగీతని చేజిక్కించుకుని తల, మెడమీద పలుమార్లు కత్తితో పొడిచాడు. తాము కేవలం 20 అడుగుల దూరంలో ఉన్నా ఆపలేకపోయామని స్వపన్ దాస్ తెలిపాడు. ఆసుపత్రికి తరలించే లోపలే సంగీత మృతి చెందింది. పోలీసులు సుబ్రతా సిన్హా మీద కేసు నమోదు చేసి, అతనికోసం గాలిస్తున్నారు. ఆ అమ్మాయి తన ప్రేమని తిరస్కరించిందనే కోపంతోనే అతను ఈ హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. అతను సంవత్సరకాలంగా తమ కుమార్తె వెంటపడుతున్నాడని సంగీత తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి అతనికోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరసాత్కి చెందిన సంగీత, 9వ తరగతి చదువుతోంది. ఆమెకు వాలీబాల్ ఆట అంటే ప్రాణమని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఆడుతూ పేరుతెచ్చుకుంటున్న క్రమంలో అర్థంతరంగా ఆమె జీవితం ముగిసిపోవడం అత్యంత విషాదం.