సోమిరెడ్డి గారు.. ఆమె ఎన్టీఆర్ సతీమణి గారండి!

రాజకీయాల్లో సీనియర్లు కూడా ఈ మధ్య ఎంతపడితే అంతగా మాట్లాడేస్తున్నారు.  ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టమొచ్చిన మాటలు అనేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి … ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి గురించి ఒక ఘాటైన పదాన్ని వాడారు. నాయకుడన్నాక క్యారెక్టర్, క్రెడిబులిటీ ఉండాలన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించిన సోమిరెడ్డి …  జగన్ కూడా విశ్వసనీయత, విశ్వాసం గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వెన్నుపోటు రాజకీయం జగనే చేశారని మండిపడ్డారు. వైఎస్‌ను సీఎం […]

Advertisement
Update: 2016-03-25 08:58 GMT

రాజకీయాల్లో సీనియర్లు కూడా ఈ మధ్య ఎంతపడితే అంతగా మాట్లాడేస్తున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టమొచ్చిన మాటలు అనేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి … ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి గురించి ఒక ఘాటైన పదాన్ని వాడారు. నాయకుడన్నాక క్యారెక్టర్, క్రెడిబులిటీ ఉండాలన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించిన సోమిరెడ్డి … జగన్ కూడా విశ్వసనీయత, విశ్వాసం గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వెన్నుపోటు రాజకీయం జగనే చేశారని మండిపడ్డారు. వైఎస్‌ను సీఎం చేసిన సోనియా గాంధీకే జగన్‌ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

జగన్‌కు విశ్వసనీయత లేదు కాబట్టే కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ టీడీపీలో చేరారన్నారు. 1994లో కేవలం 25 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ లక్ష్మిపార్వతిని శిఖండిలా వాడుకుని రాజకీయాలు చేసిందన్నారు. అయినా చంద్రబాబే గెలిచారని సోమిరెడ్డి చెప్పారు. అదే సమయంలో ఆనం విజయకుమార్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా ఆనం కుటుంబంలో జగన్‌ చిచ్చు పెట్టారని కొత్త విమర్శ చేశారు. అయితే…

సోమిరెడ్డి ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మిపార్వతిని శిఖండి అనడం ఎంతవరకు సమంజసమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ సీఎంగా ఉన్న కాలంలో లక్ష్మిపార్వతి వద్ద మెప్పుపొందేందుకు ప్రయత్నించిన వారిలో సోమిరెడ్డి కూడా ఉన్నారని చెబుతుంటారు. ఎన్టీఆర్‌ ఉన్న రోజుల్లో ఆమెను ఆకాశానికి ఎత్తిన నేతలు ఇప్పుడు ఆమెకు ఎలాంటి అండ లేదుకాబట్టి శిఖండి అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలంటన్నారు. ఎన్టీఆర్ సతీమణికి ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఆనం కుటుంబంలో జగన్‌ చిచ్చు పెట్టారని చెబుతున్న సోమిరెడ్డి కొన్ని నెలల క్రితం జరిగిన ఘటనలను మరిచిపోయినట్టుగా ఉన్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఆనం వివేకా, రామనారాయణరెడ్డి, విజయకుమార్ రెడ్డి అందరూ కాంగ్రెస్‌లోనే ఉండేవారు. కానీ తొలుత ఆనం వివేకా, ఆనం రామనారాయణరెడ్డిలను కాంగ్రెస్‌నుండి బయటకు లాగి తమ పార్టీలో చేర్చుకున్నది టీడీపీయే. అంటే ఒకవిధంగా కాంగ్రెస్‌లో కలిసి ఉన్న అన్నదమ్ములను తొలుత చీల్చిందే టీడీపీ కదా అని ప్రశ్నిస్తున్నారు. ఆ లెక్కన చూస్తే ఆనం కుటుంబంలో తొలుత చిచ్చుపెట్టింది టీడీపీనే కదా అన్న ప్రశ్న ఎదురవుతోంది. నమ్ముకున్న అన్నలు వదిలేసి వెళ్లడంతో ఆనం విజయకుమార్ రెడ్డి తన దారి తాను చూసుకుని వైసీపీలో చేరితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News