అనితపై ఆ ముగ్గురికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు? నానిని చౌదరి అనరేం?

ఈ మధ్య తన కులాన్ని హైలైట్ చేసేలా టీడీపీ నేతలు పదేపదే రోజారెడ్డి అని సంబోధించడంపై రోజా మండిపడ్డారు. ఇది వరకు లేనిది ఇప్పుడే ఎందుకు తన పేరు చివర రెడ్డి అన్న పదం జోడిస్తున్నారని ప్రశ్నించారు. రోజారెడ్డి అనితను తిట్టింది అని చెప్పడం ద్వారా ఒక రెడ్డి మహిళ ఒక దళిత మహిళను తిట్టింది అని చాటిచెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలా కులరాజకీయాలు ఎందుకు చేస్తున్నారని రోజా నిలదీశారు. తాను ఎక్కడా కూడా రోజారెడ్డి అని […]

Advertisement
Update: 2016-03-25 04:12 GMT

ఈ మధ్య తన కులాన్ని హైలైట్ చేసేలా టీడీపీ నేతలు పదేపదే రోజారెడ్డి అని సంబోధించడంపై రోజా మండిపడ్డారు. ఇది వరకు లేనిది ఇప్పుడే ఎందుకు తన పేరు చివర రెడ్డి అన్న పదం జోడిస్తున్నారని ప్రశ్నించారు. రోజారెడ్డి అనితను తిట్టింది అని చెప్పడం ద్వారా ఒక రెడ్డి మహిళ ఒక దళిత మహిళను తిట్టింది అని చాటిచెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలా కులరాజకీయాలు ఎందుకు చేస్తున్నారని రోజా నిలదీశారు. తాను ఎక్కడా కూడా రోజారెడ్డి అని చెప్పుకోనని కనీసం రికార్డుల్లో కూడా తన పేరు చివర రెడ్డి ఉండదన్నారు. అలాంటప్పుడు టీడీపీ నేతలు పదేపదే రోజారెడ్డి అని పిలవడం దేనికి సంకేతం అన్నారు.

తనతో పాటు ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు అందుకున్న కొడాలి నానిని మాత్రం… కొడాలి నాని చౌదరి అని ఎందుకు టీడీపీ నేతలు సంబోధించడం లేదని రోజా ప్రశ్నించారు. తనను మాత్రమే రోజా రెడ్డి అని ఎందుకు సంబోధిస్తున్నారని ఆమె నిలదీశారు. కులరాజకీయాలను రెచ్చగొట్టాలనుకుంటున్నారా అని రోజా నిలదీశారు. ( ప్రివిలేజ్ కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రోజాను బొండా ఉమ పదేపదే రోజారెడ్డి రోజారెడ్డి అని ఓ పాతికసార్లకు పైగా ఉచ్చరించారు.అంతేకాదు కుల విషయంలో రోజాను టార్గెట్ చేయాలనుకున్న ప్రతిసారి టీడీపీ నేతలు రోజారెడ్డి అని సంబోధిస్తున్నారు. సాధారణ సమయంలో మాత్రం రోజా అనే మాట్లాడుతున్నారు. బహుశా ఆ విషయాలను పరిగణలోకి తీసుకునే రోజా మాట్లాడి ఉండవచ్చు).

తనను రాజకీయంగా సర్వనాశనం చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రోజా ఆరోపించారు. తన ప్రాణాలను తీసేందుకు కూడా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అనితను తిట్టానంటూ వరుస పెట్టి తనకు నోటీసులు పంపుతున్నారని… అదే తాము టీడీపీ నేతలపై ఫిర్యాదు చేస్తే మాత్రం ప్రివిలేజ్ కమిటీ పట్టించుకోవడం లేదన్నారు. అనితపై స్పీకర్‌, సీఎం, యనమలకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని ప్రశ్నించారు. అనిత విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపుతున్నారని రోజా నిలదీశారు. అనిత విషయంలో మాత్రమే వరుసగా నోటీసులు ఎందుకిస్తున్నారని రోజా ప్రశ్నించారు. అనితపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని చంద్రబాబే అనితలాంటి వారిని రాజకీయస్వార్థం కోసం వాడుకుంటున్నారని రోజా విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News