హైకోర్టులో రోజాకు ఎదురుదెబ్బ

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రోజాపై ఏడాది సస్పెన్షన్‌ను కొట్టి వేస్తూ  సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.   సింగిల్ బెంచ్ ఎదుట కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.  గతంలో సస్పెన్షన్‌ను కొట్టివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి డివిజన్‌ బెంచ్‌ ముందు సవాల్ చేశారు. సభలో రోజా ప్రవర్తన సరిగా లేదని అందుకే వేటు వేయాల్సి వచ్చిందని వాదించారు.  శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న వాదనతో […]

Advertisement
Update: 2016-03-22 01:23 GMT

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రోజాపై ఏడాది సస్పెన్షన్‌ను కొట్టి వేస్తూ సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఎదుట కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గతంలో సస్పెన్షన్‌ను కొట్టివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి డివిజన్‌ బెంచ్‌ ముందు సవాల్ చేశారు. సభలో రోజా ప్రవర్తన సరిగా లేదని అందుకే వేటు వేయాల్సి వచ్చిందని వాదించారు. శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. అసెంబ్లీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేదని డివిజిన్ బెంచ్‌ అభిప్రాయపడింది. ప్రివిలేజ్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పింది. డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో రోజా ఉన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News