మాల్యా నివాస వేలం...సాగ‌లేదు!

కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజ‌య్ మాల్యా నివాస భ‌వ‌నాన్ని వేలం వేయాల‌ని భావించిన ఎస్‌బిఐ ప్ర‌య‌త్నం ముందుకు సాగ‌లేదు.  విజ‌య్‌మాల్యాకు ఉన్న అనేక నివాస భ‌వ‌నాల్లో ముంబ‌యిలో ఉన్న ఈ భ‌వ‌నం కూడా ఒక‌టి. ఆన్‌లైన్‌లో వేలం నిర్వ‌హించాల‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు భావించ‌గా బిడ్డ‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేదు. దీని ప్రారంభ ధ‌ర‌ను 150 కోట్లుగా నిర్ణ‌యించారు. గురువారం ఉద‌యం 11.30గంల‌కు వేలం ప్రారంభించి, వేలంపాట‌కు ఎవ‌రూ ముందుకురాక‌పోవ‌డంతో ఒక్క‌గంట‌లోనే ముగించారు. మార్చి […]

Advertisement
Update: 2016-03-17 22:44 GMT

కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజ‌య్ మాల్యా నివాస భ‌వ‌నాన్ని వేలం వేయాల‌ని భావించిన ఎస్‌బిఐ ప్ర‌య‌త్నం ముందుకు సాగ‌లేదు. విజ‌య్‌మాల్యాకు ఉన్న అనేక నివాస భ‌వ‌నాల్లో ముంబ‌యిలో ఉన్న ఈ భ‌వ‌నం కూడా ఒక‌టి. ఆన్‌లైన్‌లో వేలం నిర్వ‌హించాల‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు భావించ‌గా బిడ్డ‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేదు. దీని ప్రారంభ ధ‌ర‌ను 150 కోట్లుగా నిర్ణ‌యించారు. గురువారం ఉద‌యం 11.30గంల‌కు వేలం ప్రారంభించి, వేలంపాట‌కు ఎవ‌రూ ముందుకురాక‌పోవ‌డంతో ఒక్క‌గంట‌లోనే ముగించారు.

మార్చి 18న అంటే ఈ రోజు విజ‌య్ మాల్యా ఐడిబిఐ బ్యాంకు రుణాల ఎగ‌వేత కేసులో ఇడిముందు హాజ‌రు కావాల్సి ఉంది. అయితే తాను శుక్ర‌వారానిక‌ల్లా హాజ‌రు కాలేన‌ని త‌న‌కు ఏప్రిల్ వ‌ర‌కు గ‌డువు కావాల‌ని మాల్యా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌ అధికారుల‌ను కోరాడు. అయితే మాల్యా అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించాలా వ‌ద్దా అనే విష‌యంపై ఇడి అధికారులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఆయ‌న చెబుతున్న కార‌ణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈ విష‌యంపై ఇడి అధికారులు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News