ఫిరాయింపు పులులు ఎక్కడంటే?

చంద్రబాబు ప్రభుత్వంపైనే కాకుండా, స్పీకర్‌కోడెలపైనా అవిశ్వాసతీర్మానాలను వైసీపీ ప్రవేశపెట్టింది. రెండు రోజుల పాటు వీటిపై చర్చ జరిగింది. అయితే రెండు అవిశ్వాస తీర్మానాల్లో ఏదో అద్భుతం జరుగుతుందని ఎవరూ ఆశించలేదు. కాకపోతే అందరి చూపు వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపైనే. వారు ఎక్కడున్నారు?. సభకు రాకుండా ఎక్కడికి వెళ్లారు?. వైసీపీ విప్‌లు కూడా చేరలేనంత దూరంలో ఎక్కడ దాక్కున్నారు? అంటూ ఎనిమిది మంది ఎమ్మెల్యేల చుట్టే అందరి చర్చలు నడిచాయి. పాపం […]

Advertisement
Update: 2016-03-15 22:33 GMT

చంద్రబాబు ప్రభుత్వంపైనే కాకుండా, స్పీకర్‌కోడెలపైనా అవిశ్వాసతీర్మానాలను వైసీపీ ప్రవేశపెట్టింది. రెండు రోజుల పాటు వీటిపై చర్చ జరిగింది. అయితే రెండు అవిశ్వాస తీర్మానాల్లో ఏదో అద్భుతం జరుగుతుందని ఎవరూ ఆశించలేదు. కాకపోతే అందరి చూపు వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపైనే. వారు ఎక్కడున్నారు?. సభకు రాకుండా ఎక్కడికి వెళ్లారు?. వైసీపీ విప్‌లు కూడా చేరలేనంత దూరంలో ఎక్కడ దాక్కున్నారు? అంటూ ఎనిమిది మంది ఎమ్మెల్యేల చుట్టే అందరి చర్చలు నడిచాయి.

పాపం … ఒకప్పుడు పులుల్లా బతికిన ఆదినారాయణరెడ్డి, భూమా నాగిరెడ్డి కూడా సభకు రాకుండా తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బయట కనిపిస్తే వైసీపీ నేతలు … ఫిరాయించిన ఎమ్మెల్యేల చేతిలో విప్‌పెడుతారు. అప్పుడు సభలో విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే పదవులు పోతాయి. విప్ తీసుకుని సభకు రాకపోయినా వేటు ఖాయం. అదే జరిగితే ఉప ఎన్నికలొస్తాయి. అప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి వారే ఊహించుకోవాలి. అందుకే … వైసీపీ విప్‌కు అందకుండా నియోజకవర్గాలకు వెళ్లిపోయారు. ఎలాగో ముందస్తు వ్యూహంలో భాగంగా ప్రభుత్వం అప్పటికప్పుడు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడం, గంటల వ్యవధిలోనే తంతు పూర్తి చేసేందుకు ప్లాన్ చేసింది.

కాబట్టి విప్‌ అందినా వచ్చేంత సమయం మాకు దొరకలేదని చెప్పి తప్పించుకునేందుకు ఎనిమిది మందికి చాన్స్ దొరికింది. అయితే… జనం చెవుల్లో పూలు పెట్టేందుకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సాకులు దొరికి ఉండవచ్చు. కానీ పులుల్లా బతికిన ఎమ్మెల్యేలు దొంగల్లా దాక్కోవాల్సిరావడం చూసి వారి అనుచరులే బాధపడుతున్నారు. సరే తాము సభకు రావాలనుకున్నా టీడీపీ అధినాయకత్వం అనుమతివ్వలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పరువు పాతాళానికి పడిపోతున్నది టీడీపీ అధిష్టానంది కాదు. సీమ సింహాలుగా, పులుల్లా, పౌరుషానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఇంతకాలం చెప్పుకుని తిరిగిన ఫిరాయింపు ఎమ్మెల్యేలదే. ఎంటో ఎందుకు పార్టీ ఫిరాయించారో, ఎందుకు తప్పించుకుని తిరగాల్సివస్తోందో?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News