అనిత తీరుపై టీడీపీ మహిళా ఎమ్మెల్యేల ఆగ్రహం

టీడీపీలో యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్యే అనితపై సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలే ఆగ్రహంగా ఉన్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. అనితకు విపరీతమైన ప్రాధాన్యత అసెంబ్లీలో ఎందుకు లభిస్తోందని మిగిలిన వారు గుర్రుగా ఉన్నారట. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో డ్వాక్రా రుణాలకు సంబంధించి ప్రశ్న వచ్చిన సమయంలో వివాదం తలెత్తింది. డ్వాక్రా రుణాలపై వైసీపీ మహిళ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి తదితరులు ప్రశ్నలు వేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారని ఆరోపించారు. ఇందుకు సమాధానం ఇచ్చేందుకు […]

Advertisement
Update: 2016-03-16 01:29 GMT

టీడీపీలో యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్యే అనితపై సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలే ఆగ్రహంగా ఉన్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. అనితకు విపరీతమైన ప్రాధాన్యత అసెంబ్లీలో ఎందుకు లభిస్తోందని మిగిలిన వారు గుర్రుగా ఉన్నారట. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో డ్వాక్రా రుణాలకు సంబంధించి ప్రశ్న వచ్చిన సమయంలో వివాదం తలెత్తింది. డ్వాక్రా రుణాలపై వైసీపీ మహిళ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి తదితరులు ప్రశ్నలు వేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారని ఆరోపించారు.

ఇందుకు సమాధానం ఇచ్చేందుకు మంత్రి మృణాళిని సిద్ధమవుతుండగానే ఎమ్మెల్యే అనిత జోక్యం చేసుకున్నారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు అనితయే కౌంటర్ ఇవ్వబోయారు. అనంతరం మంత్రి మృణాళినికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంపై మంత్రితో పాటు మిగిలిన అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారని కథనాలు ప్రసారం అయ్యాయి. సభలో సంబంధిత మంత్రి ఉండగా అనిత జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇలా వ్యవహరించడం మంత్రిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. చాలా విషయాల్లో అనిత అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని… మైక్‌ కూడా అనితకు పదేపదే వస్తోందని… అలా రావడానికి కారణాలు ఏమిటో! అని మహిళా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని మీడియా కథనాల సారాంశం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News