విశాల్ పై కన్నేసిన రాజకీయ పార్టీ

దక్షిణభారత నటీనటుల సంఘం నడిగర్ ఎన్నికల్లో హేమాహేమీలను మట్టికరిపించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరో విశాల్‌పై రాజకీయపార్టీల కన్ను పడింది. తమిళనాడులో క్రేజీ హీరోగా ఉన్న విశాల్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందుకు ఇప్పటికే మధ్యవర్తులు రంగంలోకి దిగారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… విశాల్‌ కోసం గట్టిగాప్రయత్నాలు చేస్తోంది. చెన్నైకి చెందిన క్రికెటర్ శ్రీకాంత్‌ … విశాల్‌ను బీజేపీలోకి చేర్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. శ్రీకాంత్‌ […]

Advertisement
Update: 2016-03-14 21:45 GMT

దక్షిణభారత నటీనటుల సంఘం నడిగర్ ఎన్నికల్లో హేమాహేమీలను మట్టికరిపించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరో విశాల్‌పై రాజకీయపార్టీల కన్ను పడింది. తమిళనాడులో క్రేజీ హీరోగా ఉన్న విశాల్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందుకు ఇప్పటికే మధ్యవర్తులు రంగంలోకి దిగారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… విశాల్‌ కోసం గట్టిగాప్రయత్నాలు చేస్తోంది. చెన్నైకి చెందిన క్రికెటర్ శ్రీకాంత్‌ … విశాల్‌ను బీజేపీలోకి చేర్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. శ్రీకాంత్‌ ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నారు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి విశాల్‌ను బరిలో దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తమిళనాడులో బలహీనంగా ఉన్న పార్టీ విశాల్‌ రాకతో ఊహించని రీతిలో పుంజుకుంటుందని కమలనాథులు భావిస్తున్నారు.

పైగా తమిళనాడు రాజకీయాల్లో సినీతారల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. విశాల్‌తో ఇప్పటికే బీజేపీ ప్రతినిధులు రెండుమూడు సార్లు చర్చలు జరిపారు. అయితే బీజేపీలో చేరడంపై విశాల్ ఎటూతేల్చుకోలేకపోతున్నారని సమాచారం. నడిగర్‌ సంఘం భవనాన్ని నిర్మించే పనిలో విశాల్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ విషయాన్నే బీజేపీ నేతలకు విశాల్ వివరించారని సమాచారం. అయినప్పటికీ బీజేపీ నేతలు విశాల్‌ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తొలుత రజనీకాంత్‌ కోసం బీజేపీ నేతలు గట్టిగాప్రయత్నించారు. తమిళనాడు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అయినా రజనీకాంత్ తనకు రాజకీయాలు వద్దని తిరస్కరించారు. దీంతో బీజేపీ నేతలు విశాల్‌ లాంటి హీరోల కోసం వల వేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News