అవిశ్వాసంపై ఊహించని ఎత్తు వేసిన ప్రభుత్వం

వైసీపీ అవిశ్వాస తీర్మానంపై ఏపీ ప్రభుత్వం ఊహంచని ఎత్తు వేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడే విధంగా పావులు కదిపింది. వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై హఠాత్తుగా చర్చకు అంగీకరించింది. ఉదయం సమావేశమైన బీఏసీ ఈ రోజే అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిఫార్సు చేసింది. వైసీపీ ప్రతినిధులు వ్యతిరేకించినా మెజారిటీ ఉండడంతో బీఏసీలో ప్రభుత్వం మాటే నెగ్గింది. ఇలా హఠాత్తుగా తీర్మానంపై చర్చకు అనుమతివ్వడం వెనుక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించే ఎత్తుగడ ఉందని భావిస్తున్నారు. పార్టీ […]

Advertisement
Update: 2016-03-14 00:56 GMT

వైసీపీ అవిశ్వాస తీర్మానంపై ఏపీ ప్రభుత్వం ఊహంచని ఎత్తు వేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడే విధంగా పావులు కదిపింది. వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై హఠాత్తుగా చర్చకు అంగీకరించింది. ఉదయం సమావేశమైన బీఏసీ ఈ రోజే అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిఫార్సు చేసింది. వైసీపీ ప్రతినిధులు వ్యతిరేకించినా మెజారిటీ ఉండడంతో బీఏసీలో ప్రభుత్వం మాటే నెగ్గింది. ఇలా హఠాత్తుగా తీర్మానంపై చర్చకు అనుమతివ్వడం వెనుక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించే ఎత్తుగడ ఉందని భావిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ విప్‌ కూడా జారీ చేసే అవకాశం లేకుండా ఉండేందుకే ఇలా హఠాత్తుగా చర్చకు అనుమతించారని వైసీపీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలందరికీ విప్‌లు జారీ చేస్తామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అందుబాటులో ఉన్నవారికి నోటీసుల ద్వారా, మిగిలిన వారికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విప్ జారీచేస్తామని చెప్పారు. కనీసం రెండు రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరినా బీఏసీ వినలేదని ఆవేదన చెందారు. ఒక చెడు సంప్రాదాయానికి తెరలేపారని ఎమ్మెల్యే చెవిరెడ్డి మండిపడ్డారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News