చంద్రబాబుది మొసలి ప్రేమ! వైఎస్‌ ఇచ్చింది నిజమే కానీ…

రాష్ట్రంలోని సామాజిక పించన్ల సంఖ్యను కుదించడంపై ఏపీ అసెంబ్లీలో వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.  అందరికీ పించన్లు ఇస్తామని చెప్పి ఓట్లేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏరివేత పని పెట్టుకున్నారని జగన్ విమర్శించారు.  2004లో చంద్రబాబు దిగిపోయే సమయానికి రాష్ట్రంలో 18 లక్షల పించన్లు ఇచ్చేవారని… వైఎస్ వచ్చాక ఆ సంఖ్యను 78 లక్షలకు పెంచారని జగన్ చెప్పారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఆ సంఖ్య43 లక్షల 13 వేలుగా ఉండేదన్నారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి […]

Advertisement
Update: 2016-03-09 07:20 GMT

రాష్ట్రంలోని సామాజిక పించన్ల సంఖ్యను కుదించడంపై ఏపీ అసెంబ్లీలో వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అందరికీ పించన్లు ఇస్తామని చెప్పి ఓట్లేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏరివేత పని పెట్టుకున్నారని జగన్ విమర్శించారు. 2004లో చంద్రబాబు దిగిపోయే సమయానికి రాష్ట్రంలో 18 లక్షల పించన్లు ఇచ్చేవారని… వైఎస్ వచ్చాక ఆ సంఖ్యను 78 లక్షలకు పెంచారని జగన్ చెప్పారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఆ సంఖ్య43 లక్షల 13 వేలుగా ఉండేదన్నారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండేళ్లలో ఆ సంఖ్య39 లక్షల 27 వేల 657కు తగ్గించారని విమర్శించారు. వృద్ధుల పట్ల చంద్రబాబు మొసలి ప్రేమ చూపుతున్నారని జగన్ విమర్శించారు.

రెండేళ్లలో పించన్ల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం ఏమిటని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సదరు అంశంపై సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మాట్లాడిన అచ్చెన్నాయుడు .. . వైఎస్‌ హయాంలో 78 లక్షల మందికి పించన్లు ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. కానీ భర్త ఉన్న వారికి కూడా వితంతు కోటాలో పించన్లు ఇచ్చారని ఆరోపించారు. వంద కిలోల బరువు ఎత్తగలిగిన వారికి కూడా వికలాంగులంటూ పించన్లు మంజూరు చేశారని విమర్శించారు. ఇప్పుడు తాము అర్హులను గుర్తించి పించన్లు ఇస్తున్నామన్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News