నివ్వెరపోయిన టెన్నిస్ ప్రపంచం... నేరం ఒప్పుకున్న షరపోవా

రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా టెన్నిస్‌ ప్రపంచానికి షాక్ ఇచ్చారు.  ఐదు సార్ట్‌ గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా నిలిచిన మరియా షరపోవా డ్రగ్స్ తీసుకుని దొరికిపోయారు.  డోపింగ్ టెస్ట్‌లో ఆమె దొరికిపోయారు. అయితే వెంటనే షరపోవా కూడా నేరం ఒప్పుకున్నారు.  తాను డోపింగ్‌లో పాజిటివ్‌గా చేరినట్టు ఆమె స్వయంగా మీడియాతో చెప్పారు. 2006 నుంచి తాను డ్రగ్ తీసుకుంటున్నానని ఒప్పుకుని దిగ్ర్భాంతికి గురిచేశారు. అయితే తాను తీసుకున్న డ్రగ్‌ను ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని ఆమె […]

Advertisement
Update: 2016-03-07 23:01 GMT

రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా టెన్నిస్‌ ప్రపంచానికి షాక్ ఇచ్చారు. ఐదు సార్ట్‌ గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా నిలిచిన మరియా షరపోవా డ్రగ్స్ తీసుకుని దొరికిపోయారు. డోపింగ్ టెస్ట్‌లో ఆమె దొరికిపోయారు. అయితే వెంటనే షరపోవా కూడా నేరం ఒప్పుకున్నారు. తాను డోపింగ్‌లో పాజిటివ్‌గా చేరినట్టు ఆమె స్వయంగా మీడియాతో చెప్పారు. 2006 నుంచి తాను డ్రగ్ తీసుకుంటున్నానని ఒప్పుకుని దిగ్ర్భాంతికి గురిచేశారు. అయితే తాను తీసుకున్న డ్రగ్‌ను ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని ఆమె చెప్పారు. 28 ఏళ్ల షరపోవాపై ఈ నెల 12 నుంచి తాత్కాలిక నిషేధం అమల్లోకి రానుంది. ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముంది.

చాలా పెద్ద తప్పు చేశానని ఆమె అన్నారు. అభిమానుల మనసు గాయపరిచానని క్షమించాలని కోరింది. నాలుగేళ్ల వయసు నుంచి టెన్నిస్ ఆడుతున్నానని, టెన్నిన్‌ను ఎంతో ప్రేమించానని డోపీగా తేలడం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి తనకు తెలుసన్నారు. అయితే తన కేరీర్‌ను ఇలా ముగించాలని తనకు లేదన్నారు. మరో అవకాశం తనకు దక్కుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

జనవరి 26న నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో షరపోవా ఫెయిల్ అయినట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ధ్రువీకరించింది. ఈ నెల 2న ఈ విషయాన్ని ఆమెకు తెలియజేసినట్టు వెల్లడించింది. షరపోవాపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముందని, అయితే శిక్షను తగ్గించే అవకాశం కూడా ఉందని ఆమె తరపు న్యాయవాది జాన్ హగెర్టీ చెప్పారు. ఈ విషయం తెలిసిన నైక్ సంస్థ షరపోవాతో తమ ఒప్పందాలను రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించింది.

Click on image to read:

 

 

 

Tags:    
Advertisement

Similar News