శివ శివ... ఆలయంలో ఆనం కొడుకు..!

శ్రీకాళహస్తి ఆలయంలో టీడీపీ నేతల తీరు చూసి భక్తులు, అర్చకులే షాక్‌ అయ్యారు. శివరాత్రి రోజు పవిత్ర ఆలయంలో టీడీపీ నేతలు రెండు వివాదాలు సృష్టించారు. మాజీ మంత్రి , ఇటీవలే టీడీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి  కుమారుడు శుభకర్ రెడ్డి ఆలయానికి వచ్చారు. తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలని ఈవో భ్రమరాంబను కోరారు. అయితే అందుకు నిబంధనలు ఒప్పుకోవని ఈవో చెప్పారు. అంతే ఈవోపై కస్సున లేచారాయన. నీ అంతు తేలుస్తా అంటూ బెదిరించారు. నీలాంటి […]

Advertisement
Update: 2016-03-07 00:14 GMT

శ్రీకాళహస్తి ఆలయంలో టీడీపీ నేతల తీరు చూసి భక్తులు, అర్చకులే షాక్‌ అయ్యారు. శివరాత్రి రోజు పవిత్ర ఆలయంలో టీడీపీ నేతలు రెండు వివాదాలు సృష్టించారు. మాజీ మంత్రి , ఇటీవలే టీడీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి కుమారుడు శుభకర్ రెడ్డి ఆలయానికి వచ్చారు. తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలని ఈవో భ్రమరాంబను కోరారు. అయితే అందుకు నిబంధనలు ఒప్పుకోవని ఈవో చెప్పారు. అంతే ఈవోపై కస్సున లేచారాయన. నీ అంతు తేలుస్తా అంటూ బెదిరించారు. నీలాంటి వాళ్లను చాలా మందిని బదిలీ చేయించా … సీఎంతో మాట్లాడి నీ కథ తేలుస్తా అంటూ ఈవోపై విరుచుకుపడ్డారు. శుభకర్ రెడ్డి తీరుతో ఈవో వణికిపోయారు. ఇదే ఆలయంలో మరో ఘటన కూడా జరిగింది.

టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజుకు అర్చకులు అంతరాలయ దర్శనం కల్పించడంపై టీడీపీ నేతలు గొడవకు దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలకే లేని సౌకర్యం బాపిరాజుకు ఎలా కల్పిస్తారని ఆలయ చైర్మన్, టీడీపీ నేతలు అర్చకులను బూతులు తిట్టారు. భక్తులు చూస్తుండగానే అర్చుకులను తిట్టిపోశారు. దీంతో అర్చకులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. శివరాత్రి వేళ టీడీపీ నేతల చిందులేందని భక్తులు విసుక్కున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News