నాడు అమితాబ్, నేడు సింగపూర్‌… పనిచేయని ఫ్రీ.. ఫ్రీ..

ఎన్నికలకు ముందు చాలా వాటికి చంద్రబాబు ఫ్రీ ఫ్రీ అంటూ హామీలు ఇచ్చారు. కానీ అవన్నీ జరగలేదు.  జనం మోసపోయామన్న భావనలో  బతికేస్తున్నారు. అయితే ఇదే తరహాలో చంద్రబాబును మోసం చేసింది సింగపూర్‌ కంపెనీ.  తనను చూసి, తన పని తనాన్ని చూసి సింగపూర్ కంపెనీ అమరావతి మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తోందని చంద్రబాబు వీలుదొరికనప్పుడల్లా చెప్పుకున్నారు. తాను కాకుండా మరొకరు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది సాధ్యమయ్యేదా అన్న ధోరణిలో మాట్లాడేవారు. అయితే ఇప్పుడు చంద్రబాబుకే […]

Advertisement
Update: 2016-03-06 22:31 GMT

ఎన్నికలకు ముందు చాలా వాటికి చంద్రబాబు ఫ్రీ ఫ్రీ అంటూ హామీలు ఇచ్చారు. కానీ అవన్నీ జరగలేదు. జనం మోసపోయామన్న భావనలో బతికేస్తున్నారు. అయితే ఇదే తరహాలో చంద్రబాబును మోసం చేసింది సింగపూర్‌ కంపెనీ. తనను చూసి, తన పని తనాన్ని చూసి సింగపూర్ కంపెనీ అమరావతి మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తోందని చంద్రబాబు వీలుదొరికనప్పుడల్లా చెప్పుకున్నారు. తాను కాకుండా మరొకరు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది సాధ్యమయ్యేదా అన్న ధోరణిలో మాట్లాడేవారు. అయితే ఇప్పుడు చంద్రబాబుకే చుక్కలు చూపిస్తున్నది సింగపూర్ కంపెనీ.

మాస్టర్ ప్లాన్ తయారు చేసినందుకు బిల్లు చేతిలో పెట్టింది. మాస్టర్ ప్లాన్‌కు ఏకంగా రూ. 20 కోట్లు కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి బిల్లు పంపింది. ఇది చూసిన అధికారులు తొలుత కంగుతిన్నారు. ఇదేంటి బాసు ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇస్తున్నారని చెప్పారు. తీరా చూస్తే రూ. 20 కోట్ల బిల్లు పంపారని అవాక్కయ్యారు.

ఈ పరిణామాన్ని బట్టి అధికారులు చెబుతున్నదేమిటంటే మాస్టర్ ప్లాన్ ఉచితంగా సింగపూర్ కంపెనీ ఇస్తోందని చెప్పడమే అబద్ధమంటున్నారు. ప్రజల దగ్గర గొప్పలకు పోయి ముఖ్యమంత్రి , మంత్రులు ఇలాంటి మాటలు చెప్పారని భావిస్తున్నారు. మరో ఉదాహరణ కూడా చెబుతున్నారు. ఆ మధ్య ఏపీ వైద్యఆరోగ్య శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు బాలీవుడ్ నటుడు బిగ్‌బీ అంగీకరించారని ప్రచారం చేశారు. అది కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఏపీ తరపున ప్రచారానికి అమితాబ్ ముందుకొచ్చారని నమ్మించారు. కానీ అది జరగలేదు. డబ్బు డీల్ కుదరకపోవడం వల్లే బిగ్‌ బీ వెనక్కు తగ్గి ఉంటారని అనుమానిస్తున్నారు. కేవలం తమకు విపరీతమైన పలుకుబడి ఉందని చెప్పుకునేందుకే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి ఎత్తులు వేసి చివరకు చిత్తవుతున్నారని చెబుతున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News