అమ్మాయిలు పిలిస్తే వెళ్లి కడుపు చేసేయడమే! నేను చూడని లోతులు లేవు

సావిత్రి మూవీ ఆడియో ఫంక్షన్‌లో హీరో, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  ఒక ఎమ్మెల్యే అయి ఉండి, సీనియర్ నటుడిగా ఉంటూ ఇద్దరు కూతుర్లకు తండ్రి అయిన బాలకృష్ణ అమ్మాయిల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.  అమ్మాయిలు పిలిస్తే వెళ్లి కడుపు చేయడమే అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.  ఆడియో ఫంక్షన్‌లో ప్రసంగిస్తున్న సమయంలో హఠాత్తుగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘అమ్మాయిలు  పిలిస్తే.. ..వెళ్లి ముద్దు పెట్టడమే…లేకుంటే కడుపు […]

Advertisement
Update: 2016-03-05 01:35 GMT

సావిత్రి మూవీ ఆడియో ఫంక్షన్‌లో హీరో, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి, సీనియర్ నటుడిగా ఉంటూ ఇద్దరు కూతుర్లకు తండ్రి అయిన బాలకృష్ణ అమ్మాయిల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు పిలిస్తే వెళ్లి కడుపు చేయడమే అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆడియో ఫంక్షన్‌లో ప్రసంగిస్తున్న సమయంలో హఠాత్తుగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మాయిలు పిలిస్తే.. ..వెళ్లి ముద్దు పెట్టడమే…లేకుంటే కడుపు చేసేయడమే’ అంటూ ఉపదేశం చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అంతటితో ఆగలేదు బాలయ్య.

హీరోయిన్‌ శ్రద్దాదాస్‌ కూడా ఇక్కడికి టిక్కుటిక్కుమంటూ వచ్చిందని కామెంట్ చేశారు. అదే ఊపులో తాను ఎక్కని ఎత్తులు లేవు… చూడని లోతులు లేవు అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు వదిలారు. ఈ సమయంలో అక్కడున్న హీరోయిన్లు సిగ్గుతో చచ్చిపోయారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా బహిరంగంగా అమ్మాయిలకు కడపు చేయండి అని వ్యాఖ్యానించడం ఎటువంటి సంస్కారమో!. ఆ మధ్య జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చినప్పుడు కూడా మీడియా వాళ్లు మైకులు రెడీ చేసుకుంటుంటే ఓపిక పట్టలేకపోయిన బాలయ్య… దె…. మంటారా అని బూతు అనేశారు. ఇప్పుడు బాలయ్య బూతు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది.

Full View

Full View

Click on image to read:

Tags:    
Advertisement

Similar News