గాదె గారు.. మీరు కూడా ఇలాగే మాట్లాడుతారా?

గాదె వెంకటరెడ్డి. సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన మీద అందరికీ గౌరవం. ఇప్పుడు ఈ పెద్దాయన టీడీపీలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. చంద్రబాబు రమ్మని పిలిస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధమని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు.  అది ఆయన ఇష్టం. రాజకీయాల్లో ఇంకా శ్రమించే ఓపిక ఆయనకుంటే చేరవచ్చు. కానీ రాజధానిలో జరుగుతున్న భూకుంభకోణాలకు వత్తాసు పలికేలా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇంత సీనియర్ మోస్ట్ నేత ఇలా మాట్లాడడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. రాజధాని […]

Advertisement
Update: 2016-03-04 09:25 GMT

గాదె వెంకటరెడ్డి. సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన మీద అందరికీ గౌరవం. ఇప్పుడు ఈ పెద్దాయన టీడీపీలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. చంద్రబాబు రమ్మని పిలిస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధమని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. అది ఆయన ఇష్టం. రాజకీయాల్లో ఇంకా శ్రమించే ఓపిక ఆయనకుంటే చేరవచ్చు. కానీ రాజధానిలో జరుగుతున్న భూకుంభకోణాలకు వత్తాసు పలికేలా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇంత సీనియర్ మోస్ట్ నేత ఇలా మాట్లాడడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.

రాజధాని దురాక్రమణపై మీ అభిప్రాయం ఏమిటని విలేకర్లు అడగ్గా… భూములు కొంటే తప్పేంటి అని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలే ఆ అక్రమాలను నిరూపించాలని అప్పుడే టీడీపీలో చేరిపోయిన నేతలాగా మాట్లాడారు. పత్రికల్లో వార్తలను ప్రచురించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని నీరు చల్లే ప్రయత్నం చేశారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలే కాదు ఇతర పార్టీల వారు భూములు కొన్నారంటూ తీవ్రతను పలుచన చేసే ప్రయత్నం చేశారు. గాదె వెంకటరెడ్డి గారు చెప్పింది నిజమే. రాజధానిలో భూములు కొనుక్కోవడం తప్పు కాదు. కానీ అసైన్డ్ భూములు కొనడం నేరమని చట్టం చెబుతోంది. మరి ఒక మంత్రి తన భార్యతో అసైన్డ్ భూములను కొనుగోలు చేయించారు. అది నేరం కాదా?. అలాంటి వ్యక్తిని మంత్రివర్గంలో కొనసాగించవచ్చా? అన్న దానిపై పెద్దలు సలహా ఇస్తే బాగుంటుంది.

రాజధాని పరిధిలో భవిష్యవాణి తెలిసిన వారిలాగా మంత్రులు, టీడీపీ నేతలు సరిగ్గా సీఆర్‌డీఏ పరిధి గీతకు పక్కనే ఎలా కొన్నారో తెలియాలి. భూములు కొన్న పెద్దలకు రాజధాని అక్కడే వస్తుందని ఎలా తెలుసు?. ముందే ఎలా కొనగలిగారు?. ఒకవేళ ప్రభుత్వ పెద్దలు దీనిపై ముందే లీకులిచ్చి ఉంటే అది రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని తుంగలో తొక్కడం కాదా?. ఇలాంటి వాటిపై నిజాయితీగా మాట్లాడాల్సిన స్థాయిలో ఉన్న వారు కూడా సాధారణ రాజకీయ నాయకుల తరహాలో మాట్లాడితే ఇక ఎవరేమీ చేయగలరు?. గాదె వెంకటరెడ్డి వరకు నిజాయితీపరుడిగా పేరుంది. కానీ ఈ ముసలి వయసులో పదవులకోసం ఇంతగా దిగజారాలా? అంటున్నారు జనం.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News