మధ్యలో ఆగిన యుద్ధం మళ్లీ మొదలైంది

ఒకప్పుడు రామోజీరావు వైపు చూడాలంటేనే అందరూ భయపడేవారు.  ఆయన మీద వార్తలు రాయాలన్నా మిగిలిన మీడియాల కలాలు వణికేవి. కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క సారిగా కథ మారిపోయింది.  వైఎస్ అండతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ … రామోజీపై యుద్ధం చేశారు. మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చి సంచలనం సృష్టించారు. ఉండవల్లి పోరాటం తరువాత రామోజీ కూడా చాలామంది వ్యాపారస్తులలాగా అనేక అక్రమాలకు పాల్పడిన ఆర్థిక నేరస్తుడని, ఇతరుల ఆస్తులను కూడా కబ్జాచేయగలిగిన తరహా […]

Advertisement
Update: 2016-03-02 22:51 GMT

ఒకప్పుడు రామోజీరావు వైపు చూడాలంటేనే అందరూ భయపడేవారు. ఆయన మీద వార్తలు రాయాలన్నా మిగిలిన మీడియాల కలాలు వణికేవి. కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క సారిగా కథ మారిపోయింది. వైఎస్ అండతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ … రామోజీపై యుద్ధం చేశారు. మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చి సంచలనం సృష్టించారు. ఉండవల్లి పోరాటం తరువాత రామోజీ కూడా చాలామంది వ్యాపారస్తులలాగా అనేక అక్రమాలకు పాల్పడిన ఆర్థిక నేరస్తుడని, ఇతరుల ఆస్తులను కూడా కబ్జాచేయగలిగిన తరహా వ్యక్తేనని ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే వైఎస్ హఠాన్మరణంతో ఉండవల్లి పోరాటం మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు తిరిగి రామోజీపై కోర్టుకెళ్లారు ఉండవల్లి.

పలు కేసులు ఎదుర్కొంటున్న రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడంపై హైకోర్టులో ఉండవల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి పద్మ అవార్డు పొందే అర్హత లేదని పిల్‌లో వాదించారు. పిల్‌లో ప్రతివాదులుగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ సీఎస్‌లు, వ్యక్తిగత హోదాలో రామోజీరావును చేర్చారు.

కొద్దిరోజుల క్రితమే ఈ అంశంపై ప్రెస్‌ మీట్ పెట్టిన ఉండవల్లి ఒక ఆర్థిక నేరస్తుడికి పద్మవిభూషణ్ అవార్డును కేంద్రం ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన అని చెప్పుకునే మోదీ.. రామోజీ లాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఇవ్వడం దారుణమన్నారు. మార్గదర్శి కేసు, ఫిల్మ్‌ సిటీ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయన్నారు. రామోజీ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఆధారాలు పంపుతున్నట్టు ఉండవల్లి వెల్లడించారు. విశాఖలో సైతం రామోజీపై ఒక చీటింగ్ కేసు ఉందన్నారు. రామోజీ తొలిరోజుల్లో ఎర్రచొక్కా వేసుకున్నారని, అనంతరం పచ్చ చొక్కా వేసుకుని తిరుగుతున్నారని ఉండవల్లి మండిపడ్డారు. మధ్యమధ్యలో కాంగ్రెస్‌ టోపీ కూడా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రామోజీపై ఉండవల్లి యుద్ధం చేయడానికి అప్పట్లో వైఎస్ అండగా నిలిచారు… మరి ఇప్పుడు ఆయన వెనుక ఎవరున్నారో!

Click on image to read:

Tags:    
Advertisement

Similar News