ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?!- చంద్రబాబు

వెనుకబడిన వర్గాల వారికి టీడీపీ హయాంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగబోదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. సమాజం కులం, మతం, ప్రాంతం ఆధారంగా విడిపోవడం మంచిది కాదన్నారు. కాపుల్లోనూ పేదలున్నారని వారిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను టీడీపీ తీసుకుంటుందన్నారు. కిర్లంపూడికి చిరంజీవి వెళ్లాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేసిన వ్యక్తి చిరంజీవి అని విమర్శించారు. సమాజంలో రెండే కులాలు ఉన్నాయన్నారు. ఒకటి పేదలు రెండు ధనికులు అని అన్నారు. ”ఏ కులంలో  […]

Advertisement
Update: 2016-02-08 05:59 GMT

వెనుకబడిన వర్గాల వారికి టీడీపీ హయాంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగబోదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. సమాజం కులం, మతం, ప్రాంతం ఆధారంగా విడిపోవడం మంచిది కాదన్నారు. కాపుల్లోనూ పేదలున్నారని వారిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను టీడీపీ తీసుకుంటుందన్నారు. కిర్లంపూడికి చిరంజీవి వెళ్లాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేసిన వ్యక్తి చిరంజీవి అని విమర్శించారు.

సమాజంలో రెండే కులాలు ఉన్నాయన్నారు. ఒకటి పేదలు రెండు ధనికులు అని అన్నారు. ”ఏ కులంలో పుడుతామో ఎవరికీ తెలియదు. అది ఎవరూ ఊహించలేరు. ఎవరు మాత్రం ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారు?. డబ్బులేనప్పుడు. అందరూ కూడా సంపన్నులుగానే పుట్టాలనుకుంటారు. రాజులుగా పుట్టి రాజ్యమేలాలనుకుంటారు” అని చంద్రబాబు అన్నారు. తన మద్దతు ఎప్పుడూ పేదలకే ఉంటుందన్నారు.

కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాలను రాజకీయాల కోసం వాడుకోకూడదని సూచించారు. సున్నితమైన అంశాలను ఎప్పుడూ రాజకీయాల కోసం వాడుకోకూడదన్నారు. ఈ విషయంలో ప్రజలకు చైతన్యం కలిగిస్తామన్నారు. తాను పాదయాత్ర చేసినంత దూరం మరే నేతలైనా చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తునిలో ట్రైన్ తగలబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాయలసీమ నుంచి మనుషులను పంపిన వారెవరో తేలుస్తామన్నారు. మనుషులను పంపిన వారే అసలు దోషులన్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News