హోంమంత్రిగా కొత్త కాపు నేత ?

కాపు ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో చంద్రబాబు నష్టనివారణకు కొత్త చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.  హోంమంత్రితో పాటు, డిప్యూటీ సీఎం పదవి కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఇచ్చామని ఇంతకాలం చంద్రబాబు చెబుతూ వచ్చారు. అయితే చినరాజప్పకు డిప్యూటీ సీఎం ఇవ్వడంపై కాపులు ఏమనుకుంటున్నారన్నది ఇప్పుడిప్పుడే చంద్రబాబుకు అర్థమవుతోంది. బలమైన కాపు నేతకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి ఇస్తే అధిపత్యం చలాయిస్తారన్న ఉద్దేశంతో ఏమాత్రం అనుభవం లేని చినరాజప్పను డిప్యూటీ సీఎం చేశారని తొలి నుంచి […]

Advertisement
Update: 2016-02-07 10:13 GMT

కాపు ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో చంద్రబాబు నష్టనివారణకు కొత్త చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హోంమంత్రితో పాటు, డిప్యూటీ సీఎం పదవి కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఇచ్చామని ఇంతకాలం చంద్రబాబు చెబుతూ వచ్చారు. అయితే చినరాజప్పకు డిప్యూటీ సీఎం ఇవ్వడంపై కాపులు ఏమనుకుంటున్నారన్నది ఇప్పుడిప్పుడే చంద్రబాబుకు అర్థమవుతోంది.

బలమైన కాపు నేతకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి ఇస్తే అధిపత్యం చలాయిస్తారన్న ఉద్దేశంతో ఏమాత్రం అనుభవం లేని చినరాజప్పను డిప్యూటీ సీఎం చేశారని తొలి నుంచి కాపులే విమర్శిస్తున్నారు. ఈ విషయం ఈ మధ్య మరింత బాగా ప్రచారం జరిగింది. ముద్రగడ అమరణ దీక్షకు దిగడం, డిప్యూటీ సీఎంగా ఉన్న చినరాజప్ప ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండడంతో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు.

కాపులు అప్రమత్తమయ్యారన్న భావనకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కాసింత అనుభవం, దూకుడు ఉన్న కాపు ఎమ్మెల్యేను హోంమంత్రిగా నియమించాలన్న భావనకు వచ్చారని చెబుతున్నారు. ఇందులో భాగంగా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు హోంశాఖ అప్పగిస్తారని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ముద్రగడతో చర్చల విషయంలోనూ తొలి నుంచి త్రిమూర్తులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. త్రిమూర్తులుకు హోంశాఖ అప్పగిస్తే కాపులు కూడా కాసింత శాంతిస్తారన్న భావనలో సీఎం ఉన్నారట.

కేబినెట్లో ఉన్న కాపు మంత్రులు గంటా, నారాయణ కూడా కాపు రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వాన్ని కాపాడలేకపోతున్నారని చంద్రబాబు కాసింత అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఈ మొత్తం పరిస్థితుల్లో త్రిమూర్తులు వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే త్రిమూర్తులు ఈ విషయంలో తొందరపడి బయటపడడం లేదు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News