బూట్ల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం ఇలా!

ఖ‌రీదైన బూట్లు కొనుక్కుంటున్నారా…అయితే వాటిని కొంటే చాల‌దు, అవ‌స‌రానికి వాడేందుకు వీలుగా ఎప్పుడూ అందంగా, నీట్‌గా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అదేవిధంగా ఒక ప‌ద్ధతిగా భ‌ద్ర‌ప‌ర‌చుకోవాలి. ఎక్కువ జ‌త‌ల షూలు ఉన్న‌పుడు వాడ‌కం త‌క్కువ‌గా ఉంటుంది క‌నుక మ‌రింత జాగ్ర‌త్త‌గా వాటి నిర్వ‌హ‌ణ‌ని చూడాలి. అందుకు కొన్ని చిట్కాలు- బూట్ల‌మీద మ‌ర‌క‌లు ప‌డితే మెత్త‌ని టూత్ బ్ర‌ష్‌ని తీసుకుని, నీళ్లు వెనిగ‌ర్ క‌లిపిన మిశ్ర‌మంలో దాన్ని ముంచి మ‌ర‌క‌లు ప‌డిన‌చోట శుభ్రంగా తుడ‌వాలి. ఇంకా పోని మ‌ర‌కలు […]

Advertisement
Update: 2016-02-06 01:13 GMT

ఖ‌రీదైన బూట్లు కొనుక్కుంటున్నారా…అయితే వాటిని కొంటే చాల‌దు, అవ‌స‌రానికి వాడేందుకు వీలుగా ఎప్పుడూ అందంగా, నీట్‌గా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అదేవిధంగా ఒక ప‌ద్ధతిగా భ‌ద్ర‌ప‌ర‌చుకోవాలి. ఎక్కువ జ‌త‌ల షూలు ఉన్న‌పుడు వాడ‌కం త‌క్కువ‌గా ఉంటుంది క‌నుక మ‌రింత జాగ్ర‌త్త‌గా వాటి నిర్వ‌హ‌ణ‌ని చూడాలి. అందుకు కొన్ని చిట్కాలు-

  • బూట్ల‌మీద మ‌ర‌క‌లు ప‌డితే మెత్త‌ని టూత్ బ్ర‌ష్‌ని తీసుకుని, నీళ్లు వెనిగ‌ర్ క‌లిపిన మిశ్ర‌మంలో దాన్ని ముంచి మ‌ర‌క‌లు ప‌డిన‌చోట శుభ్రంగా తుడ‌వాలి. ఇంకా పోని మ‌ర‌కలు ఉంటే లెద‌ర్ క్లీన‌ర్‌తో తుడిచి శుభ్రం చేయాలి.
  • షూని వాడాక తిరిగి వాటిని స‌రైన కండిష‌న్‌లోకి తేవ‌డానికి షూ కండిష‌న‌ర్ల‌ను వినియోగించాలి. ఇవి లెద‌ర్‌లోప‌లికి ఇంకి వాటిని మృదువుగా, ప‌టిష్టంగా ఉండేలా చూస్తాయి.
  • రిపైర్లు ఉంటే వెంట‌నే చేయించాలి.
  • బూట్ల‌ను భ‌ద్ర‌ప‌ర‌చేట‌పుడు వాటిలో షూ ట్రీల‌ను కానీ, పేప‌ర్లు కాని దూర్చి ఉంచితే వాటి షేప్ చెడిపోకుండా ఉంటుంది. అలాగే ప‌త్రిక‌ల‌ను రౌండ్‌గా చుట్టి కూడా ఇలా వాడ‌వ‌చ్చు.
  • షూ డియోడ‌రైట‌జ‌ర్‌ని కొని, భ‌ద్ర‌ప‌ర‌చేముందు షూకి స్ప్రే చేయాలి లేదా బేకింగ్ షోడాని ఒక కాగితంలో పొట్లంలా క‌ట్టి వాటిలో ఉంచినా షూలోని చెడువాస‌న‌లు దూర‌మ‌వుతాయి.
  • బూట్ల‌ను వాటిని స్టాండ్‌లో పెట్ట‌డం మంచిదే. కొంత‌మంది డ‌బ్బాలు, అట్ట‌పెట్టెల వంటి వాటిలో భ‌ద్ర ప‌రుస్తుంటారు. అలాంట‌పుడు బ‌రువుగా ఉన్న‌వాటిని అడుగున పెట్టి తేలిక‌పాటి వాటిని పైన ఉంచాలి. అంతేకాదు, జ‌త‌కూ, జ‌త‌కూ మ‌ధ్య ఒక క్లాత్‌ని ఉంచాలి. పాత టీషర్టుల‌ను ఇలా వాడ‌వ‌చ్చు. లేదా ఏవైనా పాత సంచుల్లో ఉంచి భ‌ద్ర‌ప‌ర‌చ‌వ‌చ్చు.
Tags:    
Advertisement

Similar News