స్పీకర్‌ కోడెలపై అవిశ్వాసం

రోజాపై సస్పెన్షన్ వ్యవహారాన్ని పునర్ సమీక్షించాలని కోరినా ప్రభుత్వం, స్పీకర్ కోడెల శివప్రసాద్ వెనక్కి తగ్గకపోవడంతో సభను బాయ్ కాట్ చేసిన వైసీపీ వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. రోజా సస్పెన్షన్ పట్ల స్పీకర్ తీరును నిరసిస్తూ ఆయనపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతోంది.  శాసన సభను బాయ్ కాట్ చేసి బయటకు వచ్చిన వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ విషయంపై చర్చలు జరిపారు. సభ నడుస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వైసీపీ, స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానానికి […]

Advertisement
Update: 2015-12-20 23:33 GMT

రోజాపై సస్పెన్షన్ వ్యవహారాన్ని పునర్ సమీక్షించాలని కోరినా ప్రభుత్వం, స్పీకర్ కోడెల శివప్రసాద్ వెనక్కి తగ్గకపోవడంతో సభను బాయ్ కాట్ చేసిన వైసీపీ వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. రోజా సస్పెన్షన్ పట్ల స్పీకర్ తీరును నిరసిస్తూ ఆయనపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతోంది. శాసన సభను బాయ్ కాట్ చేసి బయటకు వచ్చిన వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ విషయంపై చర్చలు జరిపారు. సభ నడుస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వైసీపీ, స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది.

ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమని చెప్పినా.. ప్రభుత్వం, స్పీకర్ వారి నిర్ణయాలను పునఃపరిశీలించాలని కోరినా అందుకు నిరాకరించడంపై ఆగ్రహంగా ఉంది. దీనికి తోడు కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై చర్చించేది లేదని ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ వైసీపీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. గతంలోనూ స్పీకర్ పై అవిశ్వాసం పెడతామని వైసీపీ ప్రకటించినా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అవిశ్వాసం పెట్టినా అది నెగ్గే అవకాశం లేదు. కేవలం స్పీకర్‌ తీరుపై నిరసన తెలిపేందుకే ఈ మార్గం ఎంచుకున్నామని వైసీపీ చెబుతోంది.
Tags:    
Advertisement

Similar News