అమెరికాలో మళ్లీ పేలిన తుపాకులు

అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినోలో ముగ్గురు అగంతకుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాడిలో 14 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. వికలాంగుల కేంద్రంలో హాలిడే పార్టీ జరుగుతుండగా సైనిక దుస్తులు ధరించి వచ్చిన ముగ్గురు అగంతకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. క్షణాల్లో ఈ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు హంతకుల కోసం గాలింపు మొదలుపెట్టాయి. ఘటనాస్థలికి కొద్ది దూరంలో ఒక దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. దాడులకు […]

Advertisement
Update: 2015-12-02 22:49 GMT

అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినోలో ముగ్గురు అగంతకుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాడిలో 14 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. వికలాంగుల కేంద్రంలో హాలిడే పార్టీ జరుగుతుండగా సైనిక దుస్తులు ధరించి వచ్చిన ముగ్గురు అగంతకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. క్షణాల్లో ఈ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు హంతకుల కోసం గాలింపు మొదలుపెట్టాయి. ఘటనాస్థలికి కొద్ది దూరంలో ఒక దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. దాడులకు వచ్చిన వారు అన్నింటికి తెగించి వచ్చినట్టుగానే ఉందని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. వారి వద్ద భారీగా ఆయుధాలున్నాయని అంటున్నారు. కాల్పుల వెనుక ఎవరున్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

తుపాకీ తూటాలకు దెబ్బతిన్న వాహనం
కాల్పులు జరిగిన ప్రాంతం
ఘటనా స్థలిలో మోహరించిన భద్రతా దళాలు

Tags:    
Advertisement

Similar News