ఫ్రాన్స్‌లో మళ్లీ కాల్పులు... విమానాల దారి మళ్లింపు

ఫ్రాన్స్‌ను ఉగ్రనీడ ఇంకా వెంటాడుతూనే ఉంది. మొన్నటి మారుణకాండలోపాలుపంచుకున్న మిగిలిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఈ సమయంలోనే ఉత్తర పారిస్‌లో ఉగ్రవాదులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. వెంటనే తేరుతున్న భద్రతాదళాలు కూడా కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం అణువణువు గాలిస్తున్నారు. మరోవైపు .. రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ రెండు విమానాలను దారి మళ్లించారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి పారిస్ వెళ్లాల్సిన […]

Advertisement
Update: 2015-11-18 00:40 GMT

ఫ్రాన్స్‌ను ఉగ్రనీడ ఇంకా వెంటాడుతూనే ఉంది. మొన్నటి మారుణకాండలోపాలుపంచుకున్న మిగిలిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఈ సమయంలోనే ఉత్తర పారిస్‌లో ఉగ్రవాదులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. వెంటనే తేరుతున్న భద్రతాదళాలు కూడా కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం అణువణువు గాలిస్తున్నారు. మరోవైపు ..

రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ రెండు విమానాలను దారి మళ్లించారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి పారిస్ వెళ్లాల్సిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం-65ను సాల్ట్‌లేక్ సిటీ మీదుగా దారి మళ్లించారు. వాషింగ్టన్ నుంచి పారిస్ వెళ్లాల్సిన మరో విమానాన్ని నోవా స్కోటియా మీదుగా పంపారు. విమానాలు సురక్షితంగా ఫ్రాన్స్ చేరుకున్నాయి. తనిఖీలు చేయగానే ఎలాంటి బాంబులు లేవని తేలింది.

Tags:    
Advertisement

Similar News