ఐరాస హక్కుల కమిటీలో పాక్‌కు ఎదురుదెబ్బ

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీలో మరోసారి సభ్యత్వం దక్కించుకోవాలనుకున్న పాకిస్థాన్‌ ఆశలు కల్లలయ్యాయి. 193 సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో కేవలం 105 ఓట్లను మాత్రమే సాధించడం వల్ల పాక్‌ ఈ అవకాశాన్ని కోల్పోయింది. రహస్య బ్యాలెట్‌ ద్వారా హక్కుల సంఘానికి 18 మందిని ఎన్నుకుంది. 47 సభ్యులున్న మానవ హక్కుల మండలిలో పాక్‌ డిసెంబర్‌ 31తో ప్రస్తుతమున్న సభ్యత్వాన్ని కోల్పోతుంది. ఇపుడు ఎన్నుకున్న 18 దేశాల సభ్యత్వ పదవీకాలం జనవరి 1న ప్రారంభమై మూడేళ్ళు ఉంటుంది. […]

Advertisement
Update: 2015-10-28 19:54 GMT
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీలో మరోసారి సభ్యత్వం దక్కించుకోవాలనుకున్న పాకిస్థాన్‌ ఆశలు కల్లలయ్యాయి. 193 సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో కేవలం 105 ఓట్లను మాత్రమే సాధించడం వల్ల పాక్‌ ఈ అవకాశాన్ని కోల్పోయింది. రహస్య బ్యాలెట్‌ ద్వారా హక్కుల సంఘానికి 18 మందిని ఎన్నుకుంది. 47 సభ్యులున్న మానవ హక్కుల మండలిలో పాక్‌ డిసెంబర్‌ 31తో ప్రస్తుతమున్న సభ్యత్వాన్ని కోల్పోతుంది. ఇపుడు ఎన్నుకున్న 18 దేశాల సభ్యత్వ పదవీకాలం జనవరి 1న ప్రారంభమై మూడేళ్ళు ఉంటుంది. సాధారణ అసెంబ్లీలో లాబీయింగ్‌ చేసుకోవడం చేతకాక పోవడం వల్లే హక్కుల కమిటీలో పాక్‌ తన స్థానాన్ని కాపాడుకోలేక పోయిందని, ఆసియా-పసిఫిక్‌ కేటగిరీలో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ పాకిస్థాన్‌ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం. హక్కుల కమిటీలో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది. ఇది 2017లో ముగుస్తుంది.
Tags:    
Advertisement

Similar News