మోదీ కోటి విరాళాన్ని తిరస్కరించిన ఈదీ ఫౌండేషన్

పదిహేనేళ్ళ క్రితం భారత్ నుంచి పాక్‌కు వెళ్లిన మూగ, చెవిటి బాలిక గీతను ఈదీ ఫౌండేషన్ అక్కున చేర్చుకున్న ఈది పౌండేషన్‌ భారత ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రకటించిన కోటి రూపాయల విరాళాన్ని సున్నితంగా తిరస్కరించింది. గీత తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఎంతగానో ప్రయత్నించిన ఈ పౌండేషన్‌ చివరకు సామాజిక మాధ్యమాల సహకారంతో సాకారమైంది. ఈపరిణామాల నేపథ్యంలో ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈదీ కుటుంబ సభ్యులు గీతను భారత్‌కు తీసుకొచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. […]

Advertisement
Update: 2015-10-27 12:31 GMT

పదిహేనేళ్ళ క్రితం భారత్ నుంచి పాక్‌కు వెళ్లిన మూగ, చెవిటి బాలిక గీతను ఈదీ ఫౌండేషన్ అక్కున చేర్చుకున్న ఈది పౌండేషన్‌ భారత ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రకటించిన కోటి రూపాయల విరాళాన్ని సున్నితంగా తిరస్కరించింది. గీత తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఎంతగానో ప్రయత్నించిన ఈ పౌండేషన్‌ చివరకు సామాజిక మాధ్యమాల సహకారంతో సాకారమైంది. ఈపరిణామాల నేపథ్యంలో ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈదీ కుటుంబ సభ్యులు గీతను భారత్‌కు తీసుకొచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోది కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అయితే దీనికి ధన్యవాదాలు చెప్పిన థెరిస్సాగా పేరుగాంచిన ఫాదర్ అబ్దుల్ సత్తార్ ఈదీ, తమ ఫౌండేషన్ విరాళాలకు వ్యతిరేకమని, 1951లో కరాచీలో ఏర్పడిన ఈదీ పౌండేషన్‌ ఇప్పటివరకు ఎవరి నుంచి విరాళాలు స్వీకరించలేదని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News